Bengal breathes in relief as Cyclone Fani exits పశ్చిమ బెంగాల్ మరోమారు తీరం దాటిన ‘ఫణి’..

Cyclone fani moving towards bangladesh no major loss in west bengal

IMD, west bengal, east midnapore, digha, midnapore, cyclone alert, relief, bangladesh, Odisha cyclone alert, cyclone alert odisha, IMD cyclone alert, Andhra pradesh fani storm, Andhra pradesh Weather, Andhra pradesh fani, Andhra pradesh storm, Andhra pradesh cyclone alert, Andhra pradesh fani alert, Odisha storm, puducherry storm, odisha weather, odisha fani storm alert, Cyclone Fani, Fani, Odisha, IMG, Puri

West Bengal heaved a sigh of relief over the weakening of Cyclone Fani, which was expected to wreak havoc at 100-120 kilometres per hour from around midnight May 4.

పశ్చిమ బెంగాల్ మరోమారు తీరం దాటిన ‘ఫణి’.. తగ్గిన ఉధృత్తి

Posted: 05/04/2019 01:21 PM IST
Cyclone fani moving towards bangladesh no major loss in west bengal

ఒడిశాపై విరుచుకుపడి ప్రాణనష్టంతో పాటు తీవ్ర ఆస్తి నష్టాన్ని మిగిల్చిన ఫణి తుఫాను... నెమ్మదిగా తన ఉదృత్తిని తగ్గించుకుంటూ పశ్చిమ బెంగాల్ లోకి అడుగుపెట్టింది. ఒడిశాలో ఫణి చేసిన విలయతాండవాన్ని చూసిన పశ్చిమ బెంగాల్ తీవ్ర టెన్షన్ కు గురైంది. అయితే తీవ్రనష్టం కలగించకుండానే బంగ్లాదేశ్ వైపు పయనిస్తుండటంతో బెంగాల్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఫణి ప్రభావంతో గత రాత్రి నుంచి 120 కీలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తుండటంతో చెట్లు, విద్యుత్ స్థంబాలు నెలకొరిగాయి.

ఏకధాటిగా కురుస్తున్న వర్షం ధాటికి వాగులు, వంకలకు ప్రవాహం పెరిగి వరదలు వచ్చే అవకాశాలు వున్నాయి. పశ్చిమ బెంగాల్ లె పిడుగులు పడటంతో ఒక వ్యక్తి మరణించాడని అధికారులు తెలిపారు. కాగా ఫణి తుఫాను ఒబిశాపై చూపినంత ప్రభావం తమ రాష్ట్రంపై చూపలేదని దీంతో కొంత ఊపిరి పీల్చుకున్నామని అధికారులు వెల్లడించారు. కాగా, ఒడిశా నుంచి పయనమైన ఫణి గంటకు 20 కిలోమీటర్ల వేగంతో... ఉత్తరం దిశగా కదులుతూ... ఈశాన్యం వైపుగా వెళ్తి.. పశ్చిమ బెంగాల్‌లో మరోసారి తీరం దాటింది. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ దిశగా కదులుతూ తన ఉదృతిని కోల్పోతోంది.

అయితే పశ్చిమ బెంగాల్ లో తుఫాను తీరం దాటిన సమయంలో గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని... వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేసినట్లు గంటకు 105 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచకపోవడం కూడా కాసింత ఉపశమనం లభించిందని అన్నారు. కాగా వెస్ట్ బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నపూర్, దిఘా, మిడ్నాపూర్ ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్థంబించిందని అధికారులు తెలిపారు. ముందస్తుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ప్రాంతాల నుంచి 45 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు.

ఫణి ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ముందస్తు చర్యల్లో భాగంగా కోల్‌కతాలోని హల్దియా ఓడరేవును మూసేశారు. హౌరా-చెన్నై మార్గంలోని 220 రైళ్లను రద్దు చేశారు. కోల్‌కతాలో స్కూళ్లకు సెలవిచ్చారు. ఇదిలావుండగా ఒడిశాపై మాత్రం ఫణి పడగ విప్పింది. పెనుతుఫాను ధాటికి 12 మంది మృత్యువాత పడ్డారు. గత మూడు దశాబ్దాలుగా వచ్చిన 4 అతితీవ్రమైన పెను తుఫాను ఇదని వాతావరణ అధికారులు పేర్కోంటున్నారు. ఫణి తుపాను ఒడిశాలో తీరం దాటి ప్రళయాన్ని సృష్టించి బంగ్లాదేశ్ దిశగా కదిలి వెళ్లిపోయానా.. ఈ ప్రాంతం మాత్రం మరో రెండు మూడు వారాలకు కానీ సాధారణ స్థితికి చేరుకునే వీలులేకుండా చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles