Priyanka Gandhi helps injured worker గాయపడిన కార్యకర్తకు మందుపూసిన ప్రియాంక

After rahul now priyanka gandhi turns good samaritan helps injured worker

Rahul Gandhi, Priyanka Gandhi, good Samaritan, injured worker, Nuavaua Kuan, Vishal Sonker, uttar pradesh, politics

After Congress president Rahul Gandhi, his sister and party’s general secretary Priyanka Gandhi turned a good Samaritan when she helped a worker who was injured while giving a portrait of former Prime Minister Indira Gandhi to her.

గాయపడిన కార్యకర్తకు మందుపూసిన ప్రియాంక గాంధీ

Posted: 03/30/2019 06:54 PM IST
After rahul now priyanka gandhi turns good samaritan helps injured worker

అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నడిచిన బాటలోనే ఆయన సోదరి ప్రియాంకగాంధీ కూడా నడుస్తూ మానవత్వం పరిమళించిన మనుషులుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల భాద్యతను తన భుజస్కందాలపై వేసుకున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ,. పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు అహర్నిషలు శ్రమిస్తున్నారు.

అయితే, ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా పార్టీకి చెందిన సాదారణ కార్యకర్త ఎంతో ఉత్సాహంతో అమె వద్దకు చేరుకునే క్రమంలో గాయపడ్డాడు. కార్యకర్త గాయపడడంతో ప్రియాంక వెంటనే స్పందించిన అమె తన స్వహస్తాలతో కార్యకర్త గాయానికి ప్రథమచికిత్స చేయడం అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్న ప్రియాంక చర్యలతో అక్కడున్న వారంతా అశ్చర్యానికి లోనయ్యారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య సమీపంలోని నువావా కువా ప్రాంతంలో  'గాంధీ' వారసురాలు పర్యటిస్తుండగా, ప్రయాగ్ రాజ్ నుంచి విశాల్ సోంకర్ అనే కార్యకర్త ఆమెను కలిసేందుకు వచ్చాడు. ప్రియాంకను కలిసి ఆమెకు ఇందిరాగాంధీ చిత్రపటాన్ని బహూకరించాలని విశాల్ భావించాడు.అయితే, ప్రియాంక వద్దకు వెళ్లి చిత్రపటం అందించే క్రమంలో ఓ సీసా పగిలి అతడి చేతికి గాయం అయింది. రక్తస్రావం అవుతుండడంతో వెంటనే స్పందించిన ప్రియాంక స్వయంగా ప్రథమ చికిత్స అందించి గాయానికి ఆయింట్ మెంట్ పూశారు. అనంతరం, తన కాన్వాయ్ లోని అంబులెన్స్ సిబ్బందిని పిలిపించి తదుపరి చికిత్స అందించాలని సూచించారు.

కాగా, ప్రియాంక సోదరుడు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా కొన్నిరోజుల క్రితం ఓ జర్నలిస్టు వేదిక పై నుంచి పడిపోతుండగా చేయి అందించి జాగ్రత్తగా వుండాలని సూచించారు. ఆ తరువాత మరో ఘటనలో రోడ్డుప్రమాదంలో గాయపడిన రాజస్థాన్ జర్నలిస్టును తన వాహనంలో ఎక్కించుకుని తన స్వహస్తాలతో ఆయన తలకు తగిలిన గాయాన్ని తడిచారు. ఆ తరువాత స్వయంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లడం తెలిసిందే. దీంతో అన్నకు తగ్గి చెల్లిగా ప్రియాంక కూడా మానవత్తాన్ని చాటుకుందని ఉత్తర్ ప్రదేశ్ వాసులు, కాంగ్రెస్ శ్రేణులు పేర్కోంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles