congress leader DK Aruna to join BJP Party బీజేపిలో చేరనున్న సీనియర్ కాంగ్రెస్ నేత డికే అరుణ

Congress leader dk aruna to join bjp party

DK Aruna, Mahbubnagar, Ram Madhav,Amit Shah, bjp, congress, TS Congress, Telangana, Telangana politics

senior leader, former minister DK Aruna gives shock to the congress, to join BJP. Sources say she is willing to contest Lok sabha elections on behalf of BJP party from Mahaboobnagar constituency.

కాంగ్రెస్ కు షాక్.. బీజేపిలో చేరనున్న సీనియర్ కాంగ్రెస్ నేత డికే అరుణ

Posted: 03/19/2019 10:30 PM IST
Congress leader dk aruna to join bjp party

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తమ పార్టీలో ధీటైన అభ్యర్థులు లేకపోవడంతో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో వున్న పార్టీలు కాంగ్రెస్, టీడీపీ నేతలకు గాలం వేస్తూ వారిని తమ పార్టీలో చేరేలా అకర్షిస్తున్నాయి. అంతేకాదు పార్టీల ఫిరాయింపులు తెరలేపుతున్నాయి. తమ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలచేలా చేస్తున్నాయి. గెలుపోటములను పక్కనబెడితే.. తమ పార్టీలో బంగారు భవిష్యత్తు కల్పిస్తామని హామీలు గుప్పిస్తున్నాయి.

తమ పార్టీ జెండాలను ఏళ్లుగా, దశాబ్దాలుగా పట్టుకుని తిరిగిన నేతలకు చరిష్మా లేకపోవడంతో.. ఇతర పార్టీల అభ్యర్థులను తమ పార్టీలో చేర్పించి.. తద్వారా పార్టీని బలోపేతం చేయాలని పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఆకర్షణలకు ఆపర్లకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు అధికార టీఆర్ఎస్‌ పార్టీలోకి క్యూకట్టారు. ఈ క్రమంలో మరో కాంగ్రెస్ సీనియర్ నేత హస్తం పార్టీకి బిగ్ షాకిచ్చాచారు.

గులాబి బాస్ పై ఒంటికాలుపై లేచిన డీకే అరుణ.. ఆ మధ్య టీఆర్ఎస్ గూటికి చేరనున్నట్లు వార్తలు వచ్చినా.. తాజాగా అమె అనూహ్యంగా బీజేపి తీర్థం పుచ్చుకోబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకీ ఇప్పటికే రాజీనామా చేసిన ఆమె ఏకంగా హస్తిన బాట పట్టి బీజేపి అగ్రనేతలతో సమావేశం కానున్నారు. ఇప్పుడీ వార్త కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది.

ఇవాళ ఉదయం డీకే అరుణ నివాసానికి చేరకున్న బీజేపీ జాతీయ నేత రాంమాధవ్ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇరువురు నేతల మధ్య సుమారు 45 నిమిషాల పాటు చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు బీజేపీ చీఫ్ అమిత్ షాతో డీకే అరుణను ఫోన్‌లో మాట్లాడించినట్లు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్‌పై అరుణకు బీజేపీ అధ్యక్షుడు భరోసా కల్పించినట్లు సమాచారం. దాంతో ఆమె బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బిజేపి పార్టీ తరపున మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె బరిలో దిగనున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DK Aruna  Mahbubnagar  Ram Madhav  Amit Shah  bjp  congress  TS Congress  Telangana  Telangana politics  

Other Articles