pawan kalyan in cow (Gow) seva వామపక్షతో జనసేన చర్చలు.. గోసేవలో పవన్

Janasena seat sharing talks with left parties

pawan kalyan, janasena, Pawan Kalyan cow seva, Pawan Kalyan left parties, nadendla manohar left parties, Pawan kalyan mangalagiri, Pawan Kalyan Gow seva, pawan kalyan nadendla manohar, andhra pradesh, politics

Janasena Leader Nadendla Manohar had talks with left parties, who are going to tie up and fight for elections, said they will meet again to settle all discussions in the presence of Pawan Kalyan.

వామపక్షతో జనసేన చర్చలు.. గోసేవలో పవన్

Posted: 03/08/2019 11:04 AM IST
Janasena seat sharing talks with left parties

రానున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్న జనసేన.. కేవలం వామపక్షాలతో మాత్రమే తాము దోస్తి కట్టి రణక్షేత్రంలోకి దిగుతామని చెప్పిన పార్టీ అందుకు అనుగూణంగా చర్యలను చేపడుతోంది. ఇందుకోసం వామపక్ష పార్టీల బలాబలాల గురించి మాట్లాడుకున్నామని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జనసేన-లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి చర్చలు విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగాయి.

ఈ చర్చల్లో సీపీఎం తరపున మధు, సీపీఐ నుంచి రామకృష్ణ, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అనంతరం, మీడియాతో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని స్పష్టం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన మరోసారి భేటీ అవుతామని, సీట్ల సర్దుబాటు చేస్తామని చెప్పారు. సీపీఎం మధు మాట్లాడుతూ, నాలుగు లేదా ఐదు రోజుల్లో సీట్ల సంఖ్య, స్థానాల ఎంపికపై భేటీ అవుతామని అన్నారు.

టీడీపీ, వైసీపీని అడ్డుకోవాలంటే తమతో సాధ్యమని, తమ కూటమే ప్రత్యామ్నాయం అని చెప్పారు. సీట్ల సర్దుబాటు పూర్తి చేసి ఎన్నికల ప్రచారానికి దిగుతామని పేర్కొన్నారు. సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ, టీడీపీ, వైసీపీ రాష్ట్రంలో డబ్బు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఓట్ల తొలగింపు, డబ్బుతో అధికారంలోకి రావాలని చంద్రబాబు, జగన్ యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు విలువలు లేని రాజకీయాలు చేస్తున్నాయని దుమ్మెత్తిపోశారు.  

పవన్ మంగళగిరి కార్యాలయంలో గోశాల

Pawan Kalyan Gow Seva Photos

జనసేన పార్టీ అధినేత, సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు వ్యవసాయం, రైతులు, పశు సంరక్షణ, సంస్కృతీ సంప్రదాయాలను పాటించడం పైన ఆయనకు ఎనలేని మక్కువ, ప్రేమ. ‘రైతు జీవితం.. పాడి, పంట కలనేత’ అని చెప్పే పవన్.. సమయం దొరికినప్పుడల్లా వ్యవసాయం చేయడమే కాదు, గో సేవ కూడా చేస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే, జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ‘సంస్కృతులను కాపాడే సమాజం’ అన్న అంశాన్ని చేర్చారు. అందుకు నిదర్శనమే.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా గోశాల కూడా ఏర్పాటు చేశారు. గోశాలలో గో సేవలో మునిగిపోయిన ఆయన.. గోవులకు మేత వేశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

Pawan Kalyan Gow Seva Photos

Pawan Kalyan Gow Seva Photos

Pawan Kalyan Gow Seva Photos

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  nadendla manohar  Gow seva  Left parties  andhra pradesh  politics  

Other Articles