Theft in actor Mohan Babu's house కలెక్షన్ కింగ్ ఇంట్లో కన్నం వేసిన దొంగలు..!

Theft in actor mohan babu s house

Hyderabad, Mohan Babu, Actor, Producer, cash, Gold ornaments, Theft, Banjara Hills, Movie News, crime

A theft of Rs 1 lakh worth gold ornaments and cash has been stolen from the senior actor Mohan Babu's house. The manager of the actor has lodged a complaint at the Banjara Hills police station.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో కన్నం వేసిన దొంగలు..!

Posted: 02/23/2019 02:32 PM IST
Theft in actor mohan babu s house

సినీ విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్, నిర్మాత మోహన్ బాబు ఇంటిలో దొంగతనం జరిగింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో గల ఆయన ఇంటిలో నగదు, ఆభరణాలు చోరీకి గురయ్యాయి. లక్షల రూపాయల నగదుతో పాటు నగలు చోరికి గురయ్యాయనీ, తమకు పనిమనిషి మీదే అనుమానం ఉందని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ విషయంపై మోహన్ బాబు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనానికి సంబంధించిన కేసును నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తులతో పాటు ప‌ని మనుషులను కూడా ఆరా తీస్తున్నారు. కచ్చితంగా తెలిసిన వ్యక్తులు ఈ దొంగతనం చేసి ఉంటారని వారు భావిస్తున్నారు. కొత్త వ్యక్తులకు ఇంటి లోపలికి వచ్చే అవకాశమే లేదని.. అందుకే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఈ దొంగతనం చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. అందరినీ విచారించిన తర్వాత అసలేం జరిగిందనేది చెబుతామంటున్నారు పోలీసులు.

ప్రాథమిక సమాచారం ప్రకారం లక్షల విలువైన బంగారం.. మరికొంత నగదు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. నిందితులను త్వరలోనే పట్టుకుని నగదు, ఆభరణాలను రికవరీ చేస్తామన్నారు. కాగా, సినీ ప్రముఖులకు చెందిన ఇళ్లలో నమ్మకంగా పనిచేస్తున్న వారే దొంగతనాలకు పాల్పడటం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంటి పనులకు మనుషులను కుదుర్చుకునే క్రమంలో వారికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించాలని సూచిస్తున్నారు పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Mohan Babu  Actor  Producer  cash  Gold ornaments  Theft  Banjara Hills  Movie News  crime  

Other Articles