Mallya tweets after debt tribunal attaches assets 9కి బదులు 13 వేల కోట్లు జప్తు చేస్తారా.?: విజయ్ మాల్యా

Banks battle vijay mallya over superyachts cars artwork

cars, vijay mallya, businessman, London, UBS group, attachments, Banks, Rs 9000cr, Rs 13000 crore, Lawyers fee charges, crime

FUGITIVE Indian businessman Vijay Mallya took to Twitter early today (1) claiming that his properties worth more than Rs 130 billion (approximately £1.3 billion ) have been attached, more than the Rs 90 billion that he said he is accused of “running away with.”

13 వేల కోట్ల అస్తులను సీజ్ చేయడం న్యాయమేనా..?: విజయ్ మాల్యా

Posted: 02/02/2019 11:49 AM IST
Banks battle vijay mallya over superyachts cars artwork

దయ్యాలు వేదాలు వల్లించడం అన్న సామెతను విన్నారా.? ఇప్పుడు అదే జరుగుతోంది. దేశ ప్రజల సొమ్మును బ్యాంకుల్లో దాచుకుంటే.. దాన్ని అప్పన్నంగా కాజేసి.. ఉద్దేశపూర్వకంగా ఎగవేసి విదేశాలకు మహారాజులా చెక్కేసిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా.. తొమ్మిది వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్న ఈ బడా వ్యాపారవేత్త.. మాజీ రాజ్యసభ సభ్యుడు వెళ్లే ముందు పార్లమెంటు సెంట్రల్ హాలులో అప్పటి కేంద్ర అర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యి మారీ మరుసటి రోజునే ఎగిరిపోయిన విషయం తెలిసిందే.

కాగా తాను అర్థిక నేరస్థుడిని కాదని, తనపై మీడియా కథనాలు బాధిస్తున్నాయని పేర్కోన్న మాల్యా.. మీడియా మిత్రులు తన నుంచి పోందిన సాయం కూడా మర్చిపోకూడదని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక ఈ కేసులో లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తున్న తరుణంలో తప్పించుకునేందుకు పలు కారణాలను అన్వేషిస్తున్న ఆయన.. తాజాగా బ్యాంకుల తీరుపై మండిపడ్డుతున్నారు. తాను పోందిన రుణాలకు వడ్డీతో కలిపి వున్నమొత్తం కాకుండా అంతకన్నా ఎక్కువ ఆస్తులను సీజ్ చేస్తున్నారని వాపోతున్నారు.

తాను ఇండియాలోని బ్యాంకులకు వడ్డీలను కూడా కలిపి రూ. 9 వేల కోట్లు చెల్లించాల్సి వుంటే, ఈడీ, బ్యాంకులు తన గ్రూప్ సంస్థలకు చెందిన రూ. 13 వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారని ఆరోపించారు. తనపై ఆర్థిక నేరస్తుడిగా ముద్రవేసి, తాను ఇవ్వాల్సిన మొత్తం కన్నా, జప్తు చేసింది ఎక్కవని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేస్తూ, ఇది సరైన చర్యేనా? అన్నారు.

తన నుంచి రుణాల వసూలు పేరిట లాయర్ల ఖర్చుల కోసం బ్యాంకులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాయని, దీనికి ఎవరు జవాబుదారీ? అని విరుచుకుపడ్డారు. తాను చెల్లించాల్సిన రుణాల కన్నా రూ. 4 వేల కోట్లను అదనంగా పట్టుకుని కూర్చున్నారని ఆరోపించారు. అయితే 122 కోట్ల మంది దేశ ప్రజలకు చెందిన తొమ్మిది వేల కోట్ల రూపాయలను తీసుకుని ఎంచక్కా జల్సాలు చేసిన మాల్యా.. తన విచ్చలవిడి ఖర్చులు చేసినప్పుడు.. విదేశాలకు పారిపోయనప్పడు ఎరుగని న్యాయం.. తన ఆస్తులను సీజ్ చేసినప్పుడు మాత్రమే కనబడుతుందా అంటూ నెట్ జనులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cars  vijay mallya  businessman  London  UBS group  attachments  Banks  Rs 9000cr  Rs 13000 crore  Lawyers fee charges  crime  

Other Articles