quota bill should go to Select Committee రాజ్యసభలో అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లుపై రగడ.. వాయిదా..

Quota bill should go to select committee demands dmk and left parties

BJP, Citizenship (Amendment) Bill, Congress, parliament, Quota bill, Rajya Sabha, Reservation, Winter Session of Parliament

CPM leader D Raja said, "A legislation of this nature will have serious implication on the society. There is a genuine demand that it should go to Select Committee," While DMK member Kanimozhi wanted to changes to quota bill.

‘అగ్రవర్ణాల రిజర్వేషన్’పై గందరగోళం.. వాయిదా పడిన రాజ్యసభ

Posted: 01/09/2019 12:54 PM IST
Quota bill should go to select committee demands dmk and left parties

అగ్రవర్ణాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ఈబీసీ బిల్లు-2018ను కేంద్రం ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టింది. క్రితం రోజున లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభలోనూ అమోదం పోందిన తరువాత చట్టంగా అగ్రవర్ణ పేదలకు లబ్ది చేకూర్చనుంది. దీంతో ఇవాళ సభ ప్రారంభం కాగానే కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సభ ప్రారంభం కాగానే రాజ్యసభ సెషన్ ఒక రోజు పొడగింపు వార్తలపై తృణముల్ కాంగ్రెస్ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు.

సభ్యులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సభను ఒక్క రోజు పొడగించడం సముచితం కాదని, ఇది సభ్యులను, సభను అవమాన పర్చడమని ఆయన అన్నారు. ఇందుకు నిరసనగా సభ వాయిదా పడిన క్రమంలోనూ సభలోనే కూర్చోని నిరసన తెలుపుతామన్నారు.  అయితే దీనిపై స్పందించిన కేంద్రమంత్రి విజయ్ గోయిల్ పలు సందర్భాలలో వాయిదాలు పడిన సభలో పలు కీలక బిల్లులు అమోదం పోందాల్సి వుందని.. ఇందుకోసమే సభను ఒక్క రోజు పాటు పోడగింపు వేసినట్లు తెలిపారు.

ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వం చేపడుతున్న పౌరసత్వం అంశంలో జరుగుతున్న హింసాత్మక ఘటనపై కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ కేంద్రాన్ని నిలదీసారు. ముందుగా ఈ అంశంపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపిై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మధ్యహ్నం రెండు గంటలకు తన వివరణను ఇస్తారని సమాచారం. ఈ క్రమంలో రాజ్యసభలో శాసనాలను అధిగమించి మరీ బిల్లును అమోదం పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, ఇది ఈ మధ్యకాలంలో ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని అయన విమర్శించారు.

ఆగ్రవర్ణ పేదలకు రిజ్వేషన్ల బిల్లును తీసుకువచ్చే అంశంలో సభలోని విపక్ష పార్టీ సభ్యులతో అంశాలను చర్చించకుండానే సభ ముందుకు బిల్లును కేంద్రం తీసుకువచ్చిందని ఆయన అన్నారు. సభా మర్యాదను, నిబంధనలను అధిగమించి ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆనంద్ శర్మ అన్నారు. రాజ్యసభకు కొన్ని అచారాలు వున్నాయని.. వాటికి కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని కూడా ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా బిల్లుపై చర్చ  జరిపేందుకు 3 గంటల సమయం ఇస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.

దీంతో కీలకమైన బిల్లుపై ఇంత తక్కువ సమయం సరిపోదంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రధాని మోదీ దేశ ప్రజలను మోసం చేయడం ఆపాలని ఈ సందర్భంగా డీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. బిల్లుకు తాను సవరణ ప్రతిపాదిస్తున్నట్లు డీఎంకే సభ్యురాలు కనిమొళి ప్రకటించగా, చైర్మన్ అందుకు అంగీకరించలేదు. దీంతో బిల్లును వెంటనే సెలెక్ట్ కమిటీకి పంపాలని డీఎంకే డిమాండ్ చేశాయి. అనంతరం బిల్లుపై అక్షేపణలు లేవనెత్తిన వామపక్ష సభ్యుడు డీ రాజా కూడా ఆక్షపణలు లేవనెత్తారు.

కాగా, ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. అయితే బిల్లును ప్రవేశపెట్టే క్రమంలో మాత్రం కేంద్రం అసంపూర్ణ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చిందని విమర్శించారు. సరిగ్గా ఎన్నికల వేళ ఈ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చి హాడావిడిగా అమోదించుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి బిల్లు సభలో అమోదం పోందితే అనేక పర్యాయాలు సవరణలు చేయాల్సి వస్తుందని కూడా కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది.

అయితే కాంగ్రెస్ కావాలనే గా లేదని, బిల్లులోని టెక్నికల్ అంశాలను లేవనెత్తి అలస్యం చేసేందుకు యత్నిస్తుందని బీజేపి అరోపిస్తుంది. మరోవైపు ఈ బిల్లుపై చర్చకు దూరంగా ఉండాలని బిహార్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రాజ్యసభను ఒకరోజు పొడిగించడంపై సభ్యులు అభ్యంతరం తెలిపారు. చివరికి సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles