Man conned many women on matrimony site నిన్నే పెళ్లాడేస్తానంటే నమ్మి మోసపోయిన యువతి

Nigerian conned many women on matrimony site arrested

matrimony site, nigerian, marriage, doctor, rachakonda police, shaadi.com, Ayush thyagi, abed obera, greater noida, corporate hospital, crime

A Nigerian, who belongs to Delhi, had recently conned a Hyderabad girl of Rs 5.1 lakh after promising to marry her. Cops are now investigating him to ascertain how many women he has conned.

నిన్నే పెళ్లాడేస్తానంటే నమ్మింది.. నైజీరియన్ చేతిలో మోసపోయింది..

Posted: 12/06/2018 01:22 PM IST
Nigerian conned many women on matrimony site arrested

పెళ్లంటే నూరేళ్ల పంట.. కానీ అదే పేరు చెప్పి.. రాజధాని నగరానికి చెందిన ఓ యువతిని మోసగించాడు ఓ ఘనుడు. దేశంకాని దేశంలో కూడా తన మోసపూరిత బుద్దని ప్రదర్శించి.. పెళ్లిపై కలలు కంటున్న యువతులను మోసగిస్తున్నాడు నైజీరియన్, రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నగర మహిళ ఒకరు తన వివాహం నిమిత్తం 'షాదీ.కామ్'లో తన పేరు నమోదు చేయించుకుంది. ఆపై కొన్ని రోజులకు ఆమె సెల్ ఫోన్ నంబర్ కు వాట్స్ యాప్ ద్వారా ఓ సందేశం వచ్చింది. తన పేరు ఆయుష్ త్యాగి అని, గ్రేటర్ నోయిడాలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్నానని చెప్పాడు.

తాను హైదరాబాద్ కు చెందిన వాడినేనని, అక్కడ స్థిరపడి క్లినిక్ పెట్టుకోవడం తన ఉద్దేశమని, ఇష్టపడితే వివాహం చేసుకుందామని చెప్పాడు. దీనికి సదరు యువతి అంగీకరించింది. తాను ఆగస్టు 8న వస్తున్నానని త్యాగి చెప్పాడు. అదే రోజు ఆమెకు 82911 97915 నంబర్ నుంచి ఫోన్ చేసి పూజ అనే మహిళ మాట్లాడింది. తాను ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారిణిగా పరిచయం చేసుకుంటూ, త్యాగి అనే వ్యక్తి రూ. 3 కోట్లతో దొరికిపోయాడని, మనీ లాండరింగ్ చట్టం కింద పట్టుబడ్డాడని చెప్పింది. కస్టమ్స్ క్లియరెన్స్ కావాలంటే రూ. 5.45 లక్షలు చెల్లించాలని నమ్మబలికాడు.

అతడి మాటలు నమ్మిన బాధితురాలు, పూజ చెప్పిన బ్యాంకు ఎకౌంట్ కు ఆ డబ్బు పంపింది. ఆపై ఎంత ట్రై చేసినా త్యాగి, పూజ ఫోన్లు కలవక పోవడంతో తనను మోసం చేశారని గ్రహించి, పోలీసులను ఆశ్రయించింది. ఆపై కేసును విచారించిన సైబర్ క్రైమ్ విభాగం బాధితురాలికి త్యాగిగా పరిచయమైన వ్యక్తి అసలు పేరు అబేద్ ఒడారా (30) అని, అతనో నైజీరియన్ అని, తన మిత్రుడు, భార్యతో కలసి ఢిల్లీలో ఉంటూ, మ్యాట్రిమోనీ వెబ్ సైట్లపై కన్నేసి మహిళలను మోసం చేస్తుంటాడని పోలీసులు తేల్చారు. అతన్ని అరెస్ట్ చేసి, ట్రాన్సిట్ వారంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అతన్నుంచి ల్యాప్‌ టాప్‌ లు, స్మార్ట్ ఫోన్లు, వైఫై రూటర్లు, ట్యాబ్‌ లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Fools should shut their mouths about pawan s marriage

  పవన్ కు మద్దతుగా నిలిచిన నరేష్.. ‘‘మీకు సిగ్గనిపించడం లేదా.?’’

  Dec 10 | జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ‘మా’ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ ప్రశంసలు కురిపించారు. రాజకీయం కూడా వ్యాపారంగా మారిన నేటి తరుణంలో పవన్ కల్యాణ్ లాంటి నేతలు ప్రజలకు అవసరమని,... Read more

 • Federal us commission seeks american sanctions against amit shah

  అమిత్ షాపై ఆంక్షలు విధించాలి: యూఎస్ కమీషన్

  Dec 10 | దేశ పౌరసత్వ సవరణ బిల్లును వివాదాస్పదమైనదిగా పేర్కొంటూ అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్‌ (యూఎస్సీఐఆర్ఎఫ్‌) ప్రకటన చేయడాన్ని భారత్‌ తోసిపుచ్చింది. అమెరికా వాదన అసమంజసం, అవాస్తవమని ఆక్షేపించింది. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందితే... Read more

 • Hyderabad metro passengers can now stream on the go

  మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్రీ ఇంటర్నెట్..

  Dec 10 | మెట్రో రైలు ప్రయాణికులకు హెచ్ఎంఆర్ఎల్ సంస్థ తీపి కబరును అందించింది. ఇకపై ప్రతి రోజు ఈ రైళ్లలో ప్రయాణించేవారికి ఇది గుడ్ న్యూస్. మెట్రో రైలు ప్రయాణికులకు జీ5 మొబైల్‌ అప్లికేషన్‌ సేవలను హైదరాబాద్‌... Read more

 • Not congress vd savarkar bought proposal of two countries

  రెండు దేశాల ప్రతిపాదనను తీసుకువచ్చిందే సవర్కర్..

  Dec 10 | స్వతంత్ర్యం వచ్చే క్రమంలో కాంగ్రెస్ దేశాన్ని మత ప్రాతిపదికన రెండుగా విభజించి వుండకపోయివుంటే ఇవాళ దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను... Read more

 • Man fined rs 9500 for hitting sampling in telangana

  మొక్కే కదా అని ఢీకొడితే.. జేబుకు చిల్లు..

  Dec 10 | తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో.. తొలినాళ్లలో విమర్శలను ఎదుర్కోన్న తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాస్ తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులు కూడా ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు.... Read more

Today on Telugu Wishesh