Goshamahal Candidate 'Transwoman' Missing గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్థిగా అన్వేషణలో ఈసీ..

Blf leaders files petition against goshamahal candidate missing

telangana elections 2018, Telangana assembly elections, Bahujan Left Front, BLF leaders, Chandramukhi Muvvala, transgender, TRS, Goshamahal constituency, telangana assembly elections 2018, Telangana. politics

Bahujan Left Front(BLF) leaders alleged failure of TRS caretaking government and police in tracing of Chandramukhi Muvvala, who went missing since Two days.

గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్థిగా అన్వేషణలో ఈసీ..

Posted: 11/28/2018 03:00 PM IST
Blf leaders files petition against goshamahal candidate missing

తెలంగాణ మహిళల భద్రతకు ఎలా వుందో అనేక సభల్లో కేసీఆర్, ఇటు కేటీఆర్ కూడా ప్రకటిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మహిళ భద్రతకు షీ టీమ్స్ కుడా ఏర్పాటు చేశామని తమ ప్రభుత్వ పనితీరును ఎన్నికల ప్రచారంలో కూడా ఊరూవాడా చెప్పుకుంటున్నారు. అయితే హైదరాబాద్ నగర నడిబొడ్డున.. అందులోనూ బీఎల్ఎప్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దూకిన ఓ అభ్యర్థి అదృశ్యమై రెండు రోజులు కావస్తున్నా.. ఇప్పటికీ జాడ తెలియకపోవడం ప్రభుత్వ గోప్పలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

హైదరాబాద్ పరిధిలోని గోషామహల్ నియోజకవర్గం నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన హిజ్రా మువ్వల చంద్రముఖి, కనిపించకుండా పోయి రెండు రోజులు గడుస్తుంది. ఈమె కనిపించడం లేదని అమె తల్లితో పాటు పార్టీ నేతలు పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే అమె ఎక్కడకు వెళ్లింది.? ఎవరైనా కిడ్నాప్ చేశారా.? అన్న అంశంపై పోలీసులు గాలింపుచర్యలకు శ్రీకారం చేశారు. చంద్రముఖి ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు సవాలుగా మారింది.

అయితే చంద్రముఖి అదృశ్యం వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలీసు శాఖను ఈసీ ఆదేశించింది. తన బిడ్డ కనిపించడం లేదంటూ చంద్రముఖి తల్లి ఈ ఉదయం హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, చంద్రముఖిని ఎవరో కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bahujan Left Front  BLF leaders  Chandramukhi Muvvala  transgender  TRS  Goshamahal  telangana  

Other Articles