బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హాపై పోలీసులు ఎప్ఐఆర్ నమోదు చేశారు. అమె తమను మోసం చేసిందంటూ ఓ ఈవెంట్ సంస్థ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవెంట్ లో హాజరయ్యేందుకు తమ వద్ద నుంచి లక్షల రూపాయలను తీసుకున్న నటి.. ఈవెంటుకు హాజరుకాకుండా తమను మోసం చేయడంతో పాటు తమ సంస్థ పట్ల ప్రజల్లో వున్న అదరణను కూడా దెబ్బతీసిందని ఈవెంట్ సంస్థ.. వారు పోలీసులకు సమర్పించిన పిర్యాదులో పేర్కోన్నారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, మొరాదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈవెంట్ మేనేజర్ ప్రమోద్ సిన్హా, సోనాక్షీని సంప్రదించి, ఇండియా ఫ్యాషన్ అండ్ బ్యూటీ అవార్డ్ కార్యక్రమానికి రావాలని కోరుతూ రూ. 28.17 లక్షలను నాలుగు ఎలక్ట్రానిక్ లావాదేవీల ద్వారా ఆమె ఖాతాలోకి పంపారు. సెప్టెంబర్ 30న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రమోద్, మరో రూ. 9 లక్షలను ఈవెంట్ కోసం ఖర్చు చేశారు.
సోనాక్షి ప్రయాణానికి అవసరమైన టికెట్లను, బస ఏర్పాట్లనూ కూడా చేశారు. అయితే, సోనాక్షి తన వద్ద నుంచి డబ్బు తీసుకుని, ఈవెంట్ కు రాలేదని, దీని వల్ల సంస్థకున్న పేరు దెబ్బతిందని ప్రమోద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వద్ద డబ్బు తీసుకున్న తరువాత, అవార్డు ప్రమోషనల్ వీడియోల్లోనూ ఆమె నటించారని, ఉదయం 10 గంటలకు విమానం ఎక్కాల్సిన ఆమె ఎయిర్ పోర్టుకు రాలేదని, ఆపై 3 గంటల విమానానికి టికెట్లు బుక్ చేయగా, ఆమె ఎగ్గొట్టిందని ఆయన ఆరోపించారు. ప్రమోద్ ఫిర్యాదు మేరకు ఖట్ గర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Jun 24 | తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలపై గత కొన్ని రోజులుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ వారికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం అధికార నివాసమైన వర్షానే... Read more
Jun 24 | కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటలోని వాయనాడ్ ఎంపీ రాహుల్... Read more
Jun 24 | బావ, బావ పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు.. అన్నది పాతకాలం నాటి నానుడి. ఆ తరువాత బావలకు సముచిత గౌరవం కలిగేంచే రోజులు వచ్చాయి. అయితే భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు.. మళ్లీ బావలను... Read more
Jun 24 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోందని పరోక్ష ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు... Read more
Jun 24 | అమెరికా ఇటీవల తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. కేవలం రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యంలో ఏకంగా 35 మంది ప్రాణాలను ఎందుకు తాము టార్గెట్ గా మారామో కూడా తెలియకుండానే బలైపోయాయి. అందుకు కారణం తుపాకీ తూటాలు.... Read more