Shots fired, 12 dead and many wounded at California bar కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం.. 12 మంది మృతి

California shooting 12 dead as gunman storms thousand oaks bar and opens fire

california shooting, thousand oaks shooting, shooting in california, Greater Los Angeles shooting, Borderline Bar and Grill shooting, us shooting latest, local University students, Sergeant Ron Helus, 12 dead, gunman, thousand oaks, los angeles, california, america, crime

An unidentified gunman was shot dead by police after opening fire at the Borderline Bar & Grill in Thousand Oaks, which is part of the Greater Los Angeles area in California, at least 12 shot dead including a police sergeant.

ITEMVIDEOS: అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం.. 12 మంది మృతి

Posted: 11/08/2018 05:18 PM IST
California shooting 12 dead as gunman storms thousand oaks bar and opens fire

అమెరికాలో గన్ కల్చర్ అక్కడి నేరాల సంఖ్యను అంతకంతకూ పెంచుతోంది. అగ్రరాజ్యంలో మరోమారు కాల్పుల మోత కలకలం సృష్టించింది. కాలిఫోర్నియా పరిధిలోని లాస్ ఏంజిలెస్ నగరంలోని థౌజండ్‌ ఓక్స్‌ ప్రాంతంలోగల బోర్డర్ లైన్‌ బార్‌ అండ్‌ గ్రిల్ లో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. స్తానిక యూనివర్శిటీ విద్యార్థులతో కిక్కిరిసిపోయిన బార్డర్ లైన్ బార్ అండ్ గ్రిల్ లోకి చొరబడిన ఓ సాయుధ అగంతకుడు.. అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో కాల్పుల్లు జరిపిన వ్యక్తితో పాటుగా 12మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో వున్న బారులోని కస్టమర్లు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలించారు. స్థానికంగా వున్న ఓ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు పార్టీ చేసుకుంటుండగా, ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే క్షతగాత్రుల్లోని పలువురి పరిస్థితి కూడా విషమంగానే వుందని పోలీసులు వెల్లడించారు.

బార్ లో నుంచి తుపాకీ పేలుళ్ల శబ్దం వినిపించడంతో కాలిఫోర్నియా హైవే పెట్రోల్‌ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. వీరితో పాటు వెన్ తురా కౌంటీ షెరిఫ్‌ ఆఫీస్‌ డిప్యూటీ రాన్ హెలియస్ కూడా బార్ లోనే ఉన్నారని ఆయన కూడా అగంతకుడు జరిపిన గాయాల్లో తీవ్ర గాయాలపాలై.. అసుపత్రిలో చికిత్స పోందుతూ మరణించారని అధికారులు తెలిపారు. ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో బార్ లో వంద మందికి పైగా కస్టమర్లు ఉన్నట్లు సమాచారం. అగంతకుడు ముందుగా పొగ వచ్చే గ్రెనేడ్లను బార్ లోకి విసిరేసి ఆ తర్వాత కాల్పులు జరపడం ప్రారంభించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పుకొచ్చారు.

గన్ తో చొరబడిన అగంతకుడు కూడా బార్ లో చనిపోయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అతడ్ని ఎవరు కాల్చారన్న విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఓ వ్యక్తి రాత్రి 11.30 గంటల సమయంలో బార్ లోకి చొరబడి నలుపు రంగు తుపాకీతో కాల్చడం ప్రారంభించినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు. ‘దాదాపు 30 రౌండ్లు తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఇప్పటికీ గన్ షాట్స్‌ వినిపిస్తూనే ఉన్నాయి’ అని సదరు వ్యక్తి చెప్పాడు.  

ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారితో పాటు 12 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. అయితే అగంతకుడు ఎవరు.? అదే యూనివర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థా.? లేక ఎవరూ అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది. గత నెల పిట్స్ బర్గ్ లోని యూదుల ప్రార్థనా మందిరంలోకి ఓ ఆంగతకుడు చొరబడి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలకు తెగించిన నలుగురు పోలీసులు ఎట్టకేలకు నిందితుడ్ని పట్టుకున్నారు. అగంతకుడు, నలుగురు పోలీసులతో పాటు మరో వ్యక్తి కూడా ఈ కాల్పుల ఘటనలో గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 12 dead  gunman  thousand oaks  los angeles  california  america  crime  

Other Articles