WhatsApp introduces stickers at last ఎట్టకేలకు వాట్సాఫ్ లో అద్భుత ఫీచర్

Whatsapp stickers now rolling out for android and iphone

WhatsApp, update, feature, Stickers, Rollout, Android, upgrade version, ios latest version, iPhone Users, social media, Facebook, Android, iOS

WhatsApp is rolling out a new update that brings support for stickers. The new update, which bumps up the WhatsApp version to 2.18.327 (on Android), adds a dedicated tab for stickers in the overhead menu.

ఎట్టకేలకు వాట్సాఫ్ లో అద్భుత ఫీచర్

Posted: 10/26/2018 05:36 PM IST
Whatsapp stickers now rolling out for android and iphone

ఫ్రఖ్యాత మెసెంజర్ సర్వీస్ వాట్సాప్ అద్భుతమైన అప్ డేట్ విడుదల చేసిది. ఈ అప్ డేట్ తో యూజర్లు తమ మిత్రులు, పరిచయస్థులకి స్టికర్లు పంపవచ్చు. వాట్సాప్ స్టికర్స్ ఫీచర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండిటిపై పని చేస్తుంది. ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వర్షన్ 2.18.329పై స్టికర్ ఫీచర్ లభిస్తోంది. అలాగే ఐఫోన్ 2.18.100పై కూడా ఈ అప్ డేట్ దొరుకుతోంది.

వాట్సాప్ యాజమాన్య సంస్థ ఫేస్ బుక్ మేలో జరిగిన డెవలపర్ కాన్ఫరెన్స్ లో మెసేజింగ్ యాప్ లో గ్రూప్ వీడియో కాల్, స్టికర్ ఫీచర్లు ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది నెలలకే కంపెనీ గ్రూప్ వీడియో కాల్ అప్ డేట్ చేసింది. ఇప్పుడు స్టికర్ ఫీచర్ ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇకపై మీరు మీ వాట్సాప్ చాట్ చేసేటపుడు స్టికర్లను వాడుకోవచ్చు. వాట్సాప్ ఫేస్ బుక్ స్టికర్లను సపోర్ట్ చేయనుంది.

యూజర్లు కోరుకుంటే తమకు నచ్చిన థర్డ్ పార్టీ స్టికర్లను డౌన్ లోడ్ చేసి వాడుకొనే సౌకర్యం కొద్ది వారాల్లోనే అందుబాటులోకి రానుంది. వాట్సాప్ లో స్టికర్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు ప్లాట్ ఫామ్స్ పై లభ్యం అవుతుంది. ఇందుకోసం ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్ 2.18.329 వర్షన్ కి అప్ గ్రేడ్ చేసుకోవాలి. ఐఓఎస్ యూజర్లు 2.18.100కి అప్ డేట్ కావాలి. ఇప్పటికిప్పుడు డౌన్ లోడ్ చేసుకొనేందుకు కంపెనీ 13 స్టికర్ల ప్యాక్ అందుబాటులోకి తెచ్చింది.

వాట్సాప్ చాట్ లో స్టికర్లను ఉపయోగించేందుకు ముందు మీరు చాట్ బార్ లో కనిపించే ఇమోజీ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు స్టికర్ ఐకాన్ కనిపిస్తుంది. హిస్టరీ ట్యాబ్ లో మీరు ముందు వినియోగించిన అన్ని స్టికర్లు ఉంటాయి. ఇవి కాకుండా ఫేవరెట్ ట్యాబ్ ఆప్షన్ ఇచ్చారు. ఇందులో మీరు మీకు ఇష్టమైన స్టికర్లను ఉంచుకోవచ్చు. బాగా నచ్చిన స్టికర్లను ఎంచుకొని స్టార్ ఐకాన్ పై క్లిక్ చేస్తే అవన్నీ ఫేవరెట్ ట్యాబ్ లో చేరిపోతాయి.

స్టికర్లను ఇలా డౌన్ లోడ్ చేయండీ

స్టికర్లను డౌన్ లోడ్ చేసేందుకు ఆల్ స్టికర్స్ ట్యాబ్ కి వెళ్లి డౌన్ లోడ్ బటన్ పై క్లిక్ చేయాలి. డౌన్ లోడ్ అయిన స్టికర్లు మై స్టికర్స్ ట్యాబ్ లో కనిపిస్తాయి. ఒకవేళ మీకు స్టోర్ లో ఉన్న స్టికర్లతో పాటు మరికొన్ని స్టికర్లు డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటే ఆల్ స్టికర్స్ ట్యాబ్ కింద కనిపించే గెట్ మోర్ స్టికర్స్ (Get More Stickers) మీద క్లిక్ చేయాలి. మీరు మై స్టికర్స్ ట్యాబ్ కి వెళ్లి స్టికర్ ప్యాక్ ని డిలిట్ చేయవచ్చు. ఈ స్టికర్లను మీరు మీ వాట్సాప్ వెబ్ లో కూడా ఉపయోగించవచ్చు. మీరు వాట్సాప్ వెబ్ లో స్టికర్లు కనిపించకపోతే cache చేసి వెబ్ పేజీని రీలోడ్ చేయాలి. ఈ ఫీచర్ ఐఓఎస్ 7.0, ఆ పై వర్షన్లలో పని చేస్తుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : WhatsApp  update  Stickers  Android  iOS  Facebook  social media  

Other Articles