BJP Leader blames citizens on soaring fuel prices అధికారపు అంధకారం.. వాహనదారులకు పోదుపు సూత్రం..

Bjp minister blames common man for soaring fuel prices

Rajkumar Rinwa, BJP, Congress, diesel prices, Fuel price hike, india fuel prices, Petrol Prices, Rajasthan, Rupee, Sachin Pilot

As the country reels under record-breaking fuel prices, Rajasthan minister Rajkumar Rinwa has laid the blame for the crisis on the citizens themselves.

అధికారపు అంధకారం.. వాహనదారులకు పోదుపు సూత్రం..

Posted: 09/11/2018 11:37 AM IST
Bjp minister blames common man for soaring fuel prices

అధికార పార్టీలో వున్న నేతలకు అధికారం ప్రజల కష్టాలను, నష్టాలను, ఇబ్బందులను పట్టించుకోకుండా ఐదేళ్ల పాటు అంధకారం అలుముకుంటుందన్న నానుడి ప్రచారంలో వుంది. సరిగ్గా ఆ నానుడిని నిజం చేసేలా ఓ బీజేపి మంత్రివర్యులు ప్రజలకు ఉచిత సలహాలు ఇచ్చి నాలుక ఖర్చుకున్నాడు. రాజస్థాన్ మంత్రి రాజ్‌కుమార్‌ రిన్వా మాత్రం ప్రజలకు అద్భుతమైన చిట్కా చెప్పారు.

పెరుగుతున్న పెట్రోలు ధరలు భారం కాకుండా ఉండాలంటే ఏం చేయాలో వివరించారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో వుండి ప్రజల కష్టనష్టాలు పట్టక.. ఉచిత సలహా ఇచ్చి ఊరుకున్నాడు. కేంద్రంలోని తమ బీజేపి ప్రభుత్వం మెప్పు పొందడానికి ఆయన ఈ ఉచిత సలహా ఇచ్చి.. అధిష్టానం దృష్టిలో మంచిస్థానం సంపాదించాలనుకున్నాడు కానీ.. అదే సమయంలో తనను ఎన్నుకున్న ప్రజలు మనస్సుల్ని మాత్రం గాయపరుస్తున్నానని మర్చిపోయాడు.

ఫలితంగా పెట్రోలు, డీజిల్ ధరలు ఎంత పెరుగుతున్నా ప్రజలకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని పేర్కొన్నారు. ఇంతకీ ఆయనిచ్చిన సలహా ఏంటో తెలుసా?.. ప్రజలే జాగ్రత్త పడి ఇంట్లోని మిగతా ఖర్చులు తగ్గించుకోవాలని సూచించాడు. ఇతర ఖర్చులు తగ్గించుకుంటే అసలు పెట్రోలు ధరలు భారమే కాదని పేర్కొన్నారు. పెట్రోలు ధరలు అనేవి క్రూడాయిల్ ధరలపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు.

ఓ వైపు కేరళ, కర్ణాటక సహా దేశంలోని పలు రాష్ట్రాలలో వరదలు సంభవించిన నేపథ్యంలో.. ప్రకృతి విలయానికి గురైన కేరళకు కేంద్రం వందల కోట్ల రూపాయలను వెచ్చించాల్సి వస్తుందని.. వరద బాధితులకు ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తోందని బోడిగుండుకు, మోకాలికి లింకేట్టేశారు. అయినా ప్రభుత్వానికి ఇంకా బోల్డంత డబ్బు కావాలని, ప్రజలు అర్థం చేసుకుని ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. అయితే ఇది నిజమని నమ్మెవారూ లేకపోలేరు.. కేంద్రం తక్షణ సాయం కింద 600 కోట్ల రూపాయలను కేరళకు విడుదల చేసిందే తప్ప.. ఆ తరువాత మాత్రం ఇంకా ఎలాంటి సాయం అందించలేదన్నది వాస్తవం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajkumar Rinwa  BJP  diesel prices  Fuel price hike  Rajasthan  Rupee  

Other Articles