CBI raids health minister, DGP Residences రాష్ట్రమంత్రి, డీజీపీ ఇళ్లపై సీబిఐ దాడులు

Gutka scam cbi raids at residences of tamil nadu health minister dgp

Gutka Scam, CBI raid, Chennai, CBI, Tamil Nadu, Tamil Nadu health minister, Tamil Nadu commissioner of police, C Vijayabaskar, TN Health Minister, DGP TK Rajendran, CBI, Madras High Court, crime

The CBI today carried out searches at around 40 locations in Tamil Nadu, including at the residences of state's health minister and the director general of police, in connection with the Gutka scam, officials said.

గుట్కా కుంభకోణం: రాష్ట్రమంత్రి, డీజీపీ ఇళ్లపై సీబిఐ దాడులు

Posted: 09/05/2018 01:31 PM IST
Gutka scam cbi raids at residences of tamil nadu health minister dgp

తమిళనాడులో సిబిఐ అధికారుల దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సినిమా తరహాలో ఏకంగా సిబిఐ అధికారులు సాక్ష్యాత్తు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ బాస్కర్ సహా రాష్ట్ర డీజిపి టికె రాజేంద్రన్ నివాసంలో కూడా తనిఖీలు చేస్తున్నారు. వీరితో పాటు పలువురు ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని సుమారు 40 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేస్తున్న అధికారులు ఎక్కడెక్కడ అన్న వివరాలను మాత్రం గోప్యంగా వుంచారు.

తమిళనాడు రాజధాని చెన్నై కేంద్రంగా కోట్ల రూపాయల విలువైన గుట్కా కుంభకోణం నడుస్తుందన్న వివరాలు గత ఏడాది వెలుగులోకి వచ్చిన తరువాత ఇంత పెద్దస్థాయిలో సోదాలను నిర్వహించడం ఇదే తొలిసారి. కాగా, అక్రమ గుట్కా వ్యాపారంతో సంబంధం ఉందనే అనుమానంతో రాష్ట్ర ఆరోగ్య మంత్రి సి.విజయ భాస్కర్‌, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ టీకే రాజేంద్రన్‌ సహా మరికొందరు ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది.

తమిళనాడులో నమిలే పొగాకు ఉత్పత్తులను నిషేధించినప్పటికీ అమ్మకాలు కొనసాగుతుండటంపై ఈ ఏడాది ఏప్రిల్‌లో మద్రాస్‌ హైకోర్టు ఈ అంశంపై విచారణ జరపాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. గతంలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఓ వ్యాపారికి సంబంధించిన ఆస్తులపై దాడులు చేయగా వారికి ఓ డైరీ లభించింది. అందులో లంచాలు ఇచ్చిన వారి జాబితాలో పలువురు రాజకీయ నాయకులు, సీనియర్‌ పోలీసు అధికారుల పేర్లు ఉన్నాయి. దీంతో హైకోర్టు ఈ కేసును ఇటీవల సీబీఐకి అప్పగించింది. ఇప్పుడు సీబీఐ ఆ దిశగా విచారణ ప్రారంభించింది.

బ్లాక్‌ మార్కెట్‌లో నిషేధిత వస్తువుల అమ్మకాలు జరుగుతున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మాజీ పోలీసు కమిషనర్‌ ఎస్‌.జార్జి, ఆహార భద్రత విభాగం, సేల్స్‌ ట్యాక్స్‌ విభాగం అధికారుల ఇళ్లతో కలిపి మొత్తం 32 చోట్ల సోదాలు చేసినట్లు తెలిపారు. 2016లో ఆదాయపన్ను అధికారులకు మాధవ రావ్‌ అనే వ్యాపారి కార్యాలయంలో ఆ డైరీ దొరికింది. అందులో పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులకు రూ.40కోట్ల దాకా లంచాలు ఇచ్చినట్లు ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gutka scam  C Vijayabaskar  TN Health Minister  DGP TK Rajendran  CBI  Madras High Court  crime  

Other Articles