Tollywood senior actor vinod no more టాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ కన్నుమూత..

Tollywood senior actor vinod passed away

vinod, villain, senior artist, character artist, brain stroke, indra, chanti, lorry driver, tv serials, tollywood, movies, entertainment

Tollywood character artist Vinod passed away today in the early morning. He acted as villain as well as character artist. Vinod got brain stroke today at 3 o’clock in the morning. His original name was Nageshwara Rao.

ITEMVIDEOS: ప్రతినాయకుడిగా మెప్పించిన టాలీవుడ్ నటుడు వినోద్ కన్నుమూత..

Posted: 07/14/2018 09:52 AM IST
Tollywood senior actor vinod passed away

దాదాపుగా 40 సంవత్సరాలు తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుని అనేక చిత్రాలలో ప్రతినాయకుడి పాత్రలో మెప్పించిన ఆ నటవిరాటుడు ఇక లేరు. సీనియర్ క్యారెక్టర్ అర్టిస్టుగా అనేక మంది అగ్రహీరోల చిత్రాలలో నటించి.. తన నటనతో మెప్పించిన నటుడు వినోద్.. ఇవాళ తెల్లవారు జామున రెండు గంటల సమయంలో బ్రెయన్ స్ట్రోక్ తో అకస్మికంగా అనంతలోకాలకు తరలివెళ్లారు. హైదరాబాద్‌లో తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. దాదాపుగా 300 చిత్రాలకు పైగా నటించిన ఆయన అటు విలన్ గా, ఇటు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెప్పించారు. అనేక టీవీ సీరియళ్లలోనూ నటించారు.

వినోద్‌ అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. వి.విశ్వేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన కీర్తి కాంత కనకం చిత్రం ద్వారా టాలీవుడ్‌లో వినోద్ ప్రస్థానం ప్రారంభమైంది. ఇందులో కథానాయకుడిగా నటించిన వినోద్, చంటి సినిమాలో పోషించిన అన్న పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంద్ర, చంటి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్, మిర్చి తదితర సినిమాల్లో నటించి మెప్పించారు. సీనియర్ నటుడు వినోద్.. ఇకలేరన్న వార్త టాలీవుడ్ పరిశ్రమలో విషాదాన్ని నింపింది.

ఫ్యాక్షన్ సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్న వినోద్ కు.. భార్య వీనావతి. వీరికి శిరీష, సురేష్‌, తేజస్వి అను ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి విషయం తెలిసి చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. వినోద్ మృతిపట్ల పలువురు ప్రముఖ నటులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ సానుభూతిని వ్యక్తం చేశారు. వినోద్ నివాసానికి వెళ్లి ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా ఆయన మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles