araku old women confident of pawan kalyan become CM పవన్ సీఎం అవుతాడని అరకు వృద్దురాలి ధీమా

Araku old women confident of pawan kalyan become chief minister

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, payakaraopeta, pawan kalyan press meet, pawan kalyan interaction with tribal youth, vishakapatnam yatra, pawan kalyan araku yatra, Pawan Kalyan uttatandhra yatra, pawan at araku, araku tribals, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan who visited vishakapatnam araku as a prat of uttarandhra porata yatra, there a old women is confident of power star becoming chief minister of the state.

ITEMVIDEOS: పవన్ సీఎం అవుతాడని అరకు వృద్దురాలి ధీమా

Posted: 06/06/2018 11:22 AM IST
Araku old women confident of pawan kalyan become chief minister

ఉత్తరాంధ్ర పోరాట యాత్రంలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించి కవాతు కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. విశాఖపట్నం జిల్లాలోని అరకు ఏజెన్సీలో పర్యటించి ఇవాళ పాయకరావు పేటకు చేరుకోనున్నారు. కాగా అరకులో జనసేనాని పవన్ కల్యాణ్ కు స్థానికుల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఇప్పటి వరకు తమ ఓట్లను వేయించుకున్న నాయకులనే చూశాం కానీ.. ఏ నాయకుడు తమ ఊరికి వచ్చి కష్టసుఖాలు అడగి తెలుసుకోలేదని అరుకువాసులు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే అన్ని పార్టీల నేతలకు భిన్నంగా తొలిసారి ఓ రాష్ట్రస్థాయి నాయకుడిగా, పార్టీ అధినేతగా ఈ బాబు వచ్చి తమ సమస్యలను అడిగాడని స్థానికులు అనందం వ్యక్తం చేస్తున్నారు. అతడు తప్పకుండా తమకు మేలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో ఉన్న పవన్ అక్కడి గిరిజన యువతీయువకులతో సమావేశం నిర్వహించిన అనంతరం కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి అక్కడి ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. వారు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మహిళలు ముఖ్యంగా గర్భిణులు పడుతున్న అవస్థలు చూసి కరిగిపోయారు. వారికి కూడా కనీసం వైద్య సదుపాయాలు అందకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రజల కోసం ఏర్పడ్డాయన్న విషయాన్ని మర్చిపోయాయని ఇక్కడి పరిస్థితులు చూస్తే అర్ధమవుతుందని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.

పవన్ కల్యాణ్ తమ వద్దకు రావడం, స్వయంగా తమ కష్టాలను అడిగి తెలుసుకోవడం, హామీలు ఇవ్వడాన్ని చూసి గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ గ్రామానికి ఒక్కడు కూడా రాలేదని, ఈ మహానుభావుడు వచ్చాడని, దండం పెడుతున్నానని ఆవేశంగా మాట్లాడింది. అతడు ముఖ్యమంత్రి అవుతాడన్న నమ్మకం తనకు ఉందని పేర్కొంది. ఇప్పుడా వృద్ధురాలి మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసువులు బాసిన ఇద్దరు జనసైనికులు

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పర్యటనను పురస్కరించుకుని ఫ్లెక్సీలు కడుతుండగా విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై  ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఈ విషాదం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ నేడు ఇక్కడ పర్యటించనున్నారు. దీంతో తమ అభిమాన హీరో రాకను పురస్కరించుకుని తునికి చెందిన తోళెం నాగరాజు, పాయకరావుపేటకు చెందిన శివ కలిసి స్థానిక సాయిమహల్ జంక్షన్ వద్ద స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనతో పాయకరావుపేటలో విషాదం నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  araku  vishakapatnam  payakaraopeta  porata yatra  andhra pradesh  politics  

Other Articles