K.R. Ramesh Kumar elected Speaker కర్ణాటక స్పీకర్ గా ఏఆర్ రమేష్ కుమార్ ఏకగ్రీవం..

K r ramesh kumar elected as karnataka speaker

AR Ramesh kumar, karnataka speaker, Kumara Swamy, srinivas puram, SM krishna, health minister, suresh, Siddaramaiah, Congress, BJP, JDS, B.S. Yeddyurappa, BJP, Congress, JD(S), karnataka assembly, K G. Bopaiah, assembly speaker, speaker election, congress mlas, jds mlas, karnataka, politics

Pro tem speaker K G. Bopaiah has announced in the Karnataka legislative assembly that K.R. Ramesh Kumar has been unanimously elected as Speaker of the Assembly. Members across party lines

కర్ణాటక స్పీకర్ గా ఏఆర్ రమేష్ కుమార్ ఏకగ్రీవం..

Posted: 05/25/2018 12:27 PM IST
K r ramesh kumar elected as karnataka speaker

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఓటరు తీర్పుతో దిమ్మదిరిగిన పార్టీలు ఎట్టకేలకు సయోద్య కుదుర్చుకుని స్పీకర్ ఎన్నిక విషయంలో చివరి వరకు ఉత్కంఠ రేపినా.. చివరిలో మాత్రం ఏకగ్రీవం చేసుకున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఏఆర్ రమేష్ కుమార్ ను ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నుకున్నాయి. చివరాఖరు నిమిషంలో పోటీ నుంచి బీజేపి తమ అభ్యర్థి సురేష్ ను తప్పించడంతో రసకందాయంలో పడతాయని భావించిన స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావడంతో ఇక కుమారస్వామి ప్రభుత్వం శాసనసభలో బలనిరూపణ కూడా నిరూపించుకోనుంది.

అంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ప్రతిపక్ష నేత యడ్యూరప్ప, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరన్, తాజా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తదితరులు రమేష్ కుమార్ స్పీకర్ గా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంలో సహకరించిన ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్ష నేత యడ్యూరప్ప స్పీకర్ ఎన్నిక పట్లు ధన్యావాదాల తీర్మాణంపై మాట్లాడుతూ.. తమ్ముడు కుమారస్వామి తనను ప్రశంసించిన సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.

అదే సమయంలో గతంలో స్పీకర్ గా పనిచేసిన అనుభవమున్న నాయకుడు మరోమారు సభాధ్యక్ష పదవికి ఎన్నికకావడం సంతోషకరమని అన్నారు. తాజా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కొత్తగా స్పీకర్ గా ఎన్నికైన అనుభవజ్ఞుడైన రమేష్ కుమార్ ఐదేళ్ల పాటు సభను సజావుగా నడిపించాలని అన్నారు. అయనకు అపారమైన అనుభవంతో పాటు చట్టాలపై కూడా మంచి అవగాహన వుండటంతో ఆయనతో ఆ పదవికి మరోమారు కీర్తిరావాలని అకాంక్షించారు.

స్పీకర్ ఎన్నికకు సహకరించిన బీజేపికి ఉపముఖ్యమంత్రి పరమేశ్వరన్ ధన్యావాదలు తెలిపారు. కాగా, రమేష్ కుమార్ గతంలో ఎస్ఎం కృష్ణ హయాంలో స్పీకర్ గా ఐదేళ్ల పాటు సభను సజావుగా నడిపించారు. సిద్దరామయ్య ప్రభుత్వంలో అరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. శ్రీనివాసపురం నుంచి అరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఆయన 18 ఏళ్ల తరువాత మరోమారు కర్ణాటక స్పీకర్ గా బాధ్యతలను చేపట్టారు. ఇక స్పీకర్ ఎన్నిక పట్ల ధన్యావాదాలను సభ్యులు తెలిపిన అనంతరం కుమారస్వామి ప్రభుత్వం తమ బలాన్ని కూడా నిరూపించుకోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AR Ramesh kumar  karnataka speaker  Kumara Swamy  SM krishna  Siddaramaiah  karnataka  politics  

Other Articles