IB warns security threat to pawan tour తుని తరహా ఘటనలు పునారావృతానికి కుట్ర: పవన్

Pawan kalyan cancels chitoor tour inspite of intelligence warnings

pawan kalyan, janasena, chitoor, guntur, bapatla, neighbour states, rowdy sheeters, Pawan Kalyan Political Yatra, pawan kalyan press note, Pawan Kalyan Political Journey, intelligence, andhra pradesh, politics

Jana Sena says no one can stop Actor turned politician Jana Sena chief pawan kalyan from meeting his fans and cadre in all the districts after havoc situation warnings from Intelligence.

తుని తరహా ఘటనలు పునారావృతానికి కుట్ర: పవన్ ను వార్న్ చేసిన నిఘా

Posted: 04/26/2018 07:49 PM IST
Pawan kalyan cancels chitoor tour inspite of intelligence warnings

జనసేన పార్టీ పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కుట్రలు, కుతంత్రాలతో ముందుకెళ్లాలని, తమ జనసైనికులను భయపట్టాలని కొన్ని స్వార్థపూరిత శక్తుల దుష్ట పన్నాగాలను పోలీస్ నిఘావర్గాలు పసిగట్టాయని జనసేన పార్టీ తెలిపింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఎన్ని కుట్రలు పన్నినా.. దుష్టశక్తుల పన్నాగాలను చేధించుకుని జనసేనాని పవన్ కల్యాన్ ప్రజల్లోకి వెళ్తారని జనసేన ఆ ప్రకటనలో పేర్కొంది. పవన్ కల్యాన్ జిల్లా పర్యటనల నేపథ్యంలో తుని తరహా ఘటనలకు పాల్పడి ప్రజా ఆస్థులను ధ్వంసం చేయాలన్న కుట్రలను దుష్టశక్తులు పన్నాయని జనసేన అరోపించింది.

ఇందుకోసం పొరుగు రాష్ట్రాలకు చెందిన కిరాయి మూకలను స్వార్థపరశక్తులు సంప్రదిస్తున్నట్లు నిఘా వర్గాలు పార్టీ నేతలను అప్రమత్తం చేశాయని తెలిపింది. ఈ మేరకు తమకు నిఘా సంస్థలు నుంచి సమాచారం వచ్చిందని కూడా పేర్కోంది. అయితే తనకు ఏం జరుగినా ప్రజల కోసం వెళ్తానని జనసేనాని సిద్దంగా వున్నారని, కానీ ప్రజలకు, ప్రజల అస్తులకు ఏలాంటి అన్యాయం జరగడానికి వీలు లేదన్న కోణం అలోచిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కోన్నాయి.

కాగా, ఇలాంటి దుష్టశక్తులు, అల్లరిమూకల అశ్రయించి ఎన్ని కుట్రలు పన్నినా.. జనసేన పార్టీకి అపకీర్తి తీసుకురావడం ఎవరి వల్ల సాధ్యమయ్యే పనికాదని కూడా పార్టీ పేర్కోంది. కార్యకర్తలకు దెబ్బలు తగిలితేనా తల్లిడిలిపోయే నేత తమకు లభించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని పేర్కోన్నాయి. ఇప్పటికే ప్రజలు జనసేనకు పవన్ కల్యాన్ ఎదుగుదల విషయంలో ఎద్కురోంటున్న దుష్టశక్తుల పన్నాగాలను చూస్తున్నారని కూడా పేర్కోంది. పవన్ ను ప్రజల్లోకి వెళ్లకుండా ఏన్ని శక్తలు ఏకమైనా సాధ్యంకాదని, సూర్యకాంతిని అరచేయి అడ్డుపెట్టి అపాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని జనసేన ప్రకటనలో పేర్కొంది.

ప్రజల్లోకి వెళ్లాలన్న తమ పార్టీ అధినేత సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరని జనసేన తెలిపింది. హైదరాబాద్ లో పార్టీ ముఖ్య నేతల సమావేశం సమావేశం నిర్వహించిన పార్టీ అధినేత పవన్, ఇక రానున్న నెల నుంచి జిల్లాల్లో సుదీర్ఘమైన పర్యటనలు జరపడానికి ప్రణాళికలు సిద్దం చేయాల్సిందిగా కూడా పార్టీ శ్రేణులను అదేశించారని ప్రకటనలో పార్టీవర్గాలు పేర్కోన్నాయి. జిల్లాలలో ప్రధాన సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిలో  తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాలు, ప్రత్యేక హోదా సాధన ధ్యేయంగా జిల్లాలలో పర్యటిస్తానని స్పష్టం చేశారు. తన సుదీర్ఘ పర్యటనల కోసం వివిధ కమిటీలను పార్టీ ముఖ్యులు ఏర్పాటు చేస్తున్నారని, జిల్లాల పర్యటన రెండు మూడు వారాలలో ప్రారంభం అయ్యే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు.
     
నిఘా వర్గాల హెచ్చరిక మేరకు కార్యక్రమాల రద్దు

తొలుత ఈ నెల 21, 22, 23 తేదీలలో చిత్తూరు, గుంటూరు బాపట్లలో పవన్ కళ్యాణ్ కార్యక్రమాలను నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నిర్ధేశిత షెడ్యూల్డు ప్రకారం శెట్టిపల్లెలో భూ సేకరణ సమస్య, చిత్తూరు పట్టణంలో రోడ్డు నిర్మాణంలో బాధితులకు జరుగుతున్న అన్యాయం వంటి ప్రజా సమస్యలపై ఆయన పర్యటనను పార్టీ సిద్ధం చేసింది. అదేవిధంగా గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురం నివాసి, కామన్వెల్త్ క్రీడల్లో విజేత వెయిట్ లిఫ్టర్ వెంకట్ రాహుల్ కు ఈ నెల 30 న స్టువర్టుపురం నుంచి ఊరేగింపు, బాపట్లలో పౌరసన్మానాన్ని చేయాలని పవన్ కళ్యాణ్  తలపెట్టారు. ఈ రెండు జిల్లాల్లో కార్యక్రమాల కోసం పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే నిఘా వర్గాల హెచ్చరికలతో ప్రజలు, ప్రజా ఆస్తులకు నష్టం కలగకూడదన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలను పార్టీ వాయిదా వేసిన విషయాన్ని ‘జనసేన’ పేర్కొంది.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  guntur  chitoor  district tour  neighbour states  rowdysheeters  andhra pradesh  politics  

Other Articles