Pawan Kalyan protest demanding justice for asifa ఖతువా ఘటనపై జనసేనాని పవన్ నిరసన.. శ్రీరెడ్డి అంశంపై స్పందన

Pawan kalyan protest in necklace road demanding justice for asifa

Jana sena, Pawan Kalyan, jana sena protest, pawan kalyan protest, kathua rape case, justice for asifa, asifa, nirbhaya, delhi, parliament, sri reddy pawan kalyan, casting couch police stations, casting couch courts, jana sena necklace road protest, Hyderabad

Actor turned politician Jana Sena chief, power star pawan kalyan angered at Kathua rape incident. janasena chief protested at Necklace road in Hyderabad and said governments should amend acts similar to singapore to punish accused in these cases.

ఖతువా ఘటనపై జనసేనాని పవన్ నిరసన.. శ్రీరెడ్డి అంశంపై స్పందన

Posted: 04/14/2018 01:41 PM IST
Pawan kalyan protest in necklace road demanding justice for asifa

కతువా ఘటన చాలా బాధాకరమైనదని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తన హృదయాన్ని ధ్రవింపజేసిందని అన్నారు. కతువా ఘటనకు నిరసనగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో తన కార్యకర్తలతో మెరుపు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దేశంలో ముక్కుపచ్చలారని బాలికలపై దురాగతాలు జరుగుతున్నాయని... వీటిని అరికట్టేందుకు బలమైన చట్టాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఆదిలోనే తుంచాల్సిన అవసరం ఉందన్నారు.
 
అత్యాచారం, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేందుకు సింగపూర్ తరహా చట్టాలను మన దేశంలోనూ అమలు చేయాల్సిన అవసరం వుందని ఆయన డిమాండ్ చేశారు. అడపడచులపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడలానే అలోచన వస్తేనే.. పైశాచిక మృగాల్లో వణుకు పుట్టేలా చట్టాలను రూపొందించాల్సిన అవసరం వుందని అన్నారు. ప్రతీఒక్కరూ మహిళా సాధికరాతను కోరుకుంటున్నారని, ఇది రావాలంటే ఆడబిడ్డలు భద్రతగా తిరిగే సమాజం కావాలని.. వారిని కాపాడే చట్టం రావాలని పవన్ ఆకాంక్షించారు.
 
దేశం నలమూలలా ఆడపిల్లలపై జరుగుతున్న దురాగతాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని పవన్ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలకు కులాలు, మతాలు అంటగట్టడం సరికాదన్నారు. ఢిల్లీలో జరిగితే తప్ప స్పందించే స్థాయిలో కేంద్రం లేదన్నారు. సింగపూర్ తరహాలో ఆడపిల్లల రక్షణకు బలమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లలు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి ఏ పరిస్థితుల్లో వస్తారో అని భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పవన్ అందోళన వ్యక్తం చేశారు.

జంతువులతో ఇలాంటి దారుణాలకు పాల్పడిన పైశాచిక మృగాలను పోల్చుతున్నారని.. అయితే జంతువులు కూడా ప్రకృతి నియమాలకు లోబడి పనిచేస్తాయన్నారు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరుగుకుండా అనేక అవగహన కార్యక్రమాలు చేపట్టాలని పవన్ తెలిపారు. అర్ధరాత్రి ఆడది నడిరోడ్డులో తిరిగినప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్లు గాంధీజీ చెప్పారని... కానీ ఇప్పుడు పసిపిల్లలు కూడా పగలు బయట తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీరెడ్డి వ్యవహారంపై స్పందిస్తూ..

తెలుగు సినీపరిశ్రమలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని, కోర్టుకు వెళ్లాలని... అప్పుడే వారికి పూర్తి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. అన్యాయానికి గురైనవారికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. టీవీలలో చర్చల వల్ల ఏమీ రాదని... కొన్ని రోజుల తర్వాత అందరూ మరిచి పోతారని, న్యాయం కూడా జరిగే అవకాశం ఉండకపోవచ్చని తెలిపారు. సెన్సేషన్ కోసం కాకుండా, న్యాయం కోసం పోరాటం చేయాలని చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana sena  Pawan Kalyan  protest  kathua  asifa  sri reddy  police stations  courts  necklace road  Hyderabad  

Other Articles