pawan kalyan donates Rs 5 lakh for mentally handicapped T20 Cricket దివ్యాంగుల టీ20 క్రికెట్ కు పవన్ కల్యాన్ విరాళం..

Pawan kalyan donates rs 5 lakh for mentally handicapped t20 cricket

pawan kalyan, janasena, mentally handicapped, T20 Cricket, guntur, mangalagiri, left parties, Pawan Kalyan janasena, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan donates Rs 5 lakh to mentally handicapped T20 cricket, who met popular hero in his JanaSena office

దివ్యాంగుల టీ20 క్రికెట్ కు పవన్ కల్యాన్ విరాళం..

Posted: 04/11/2018 07:01 PM IST
Pawan kalyan donates rs 5 lakh for mentally handicapped t20 cricket

వైకల్యం అనేది ప్రతిభకు ఏ మాత్రం అడ్డంకి కాదని దివ్యాంగులైన క్రికెటర్లు నిరూపిస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఈ రోజు హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ (బీడీసీఏ) సభ్యులు, దివ్యాంగులైన క్రికెట్ క్రీడాకారులు పవన్ కల్యాణ్‌ని కలిశారు. ఈ నెల 14వ తేదీ నుంచి హైదరాబాద్‌లో నిర్వహించే దివ్యాంగుల రెండో జాతీయ క్రికెట్ టోర్నమెంట్ - టీ20 పోటీల వివరాలను తెలిపారు. 24 రాష్ట్రాల నుంచి జట్లు పాల్గొంటున్నాయని, 18వ తేదీన పోటీలు ముగుస్తాయని చెప్పారు.  

ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులు, క్రీడాకారులని పవన్ కల్యాణ్ అభినందించి, ఈ పోటీలకు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. దివ్యాంగ క్రికెట్ జాతీయ జట్టు కెప్టెన్ వసంత కుమార్, ఏపీ జట్టు సభ్యులు శ్రీనివాసులు, తేజలతో ముచ్చటించారు. ఆత్మస్థైర్యంతో క్రీడల్లో పాల్గొనడం దివ్యాంగులందరికీ స్ఫూర్తినిస్తుందని పవన్ అన్నారు. పవన్‌ను కలిసిన వారిలో బీడీసీఏ ఛైర్మన్ పీ హరిప్రసాద్, కార్యదర్శి  కే రామ్ రెడ్డి ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  mentally handicapped  T20 Cricket  andhra pradesh  politics  

Other Articles