Air India to Recruit 518 posts for Kannur Airport ఎయిరిండియాలో ఉద్యోగాలోచ్.. పదో చాలు.. ఆపై వున్నా మేలు

Air india recruitment for kannur airport apply now for 518 various vacancies

Air India vacancies, Air India jobs, Air India handy man jobs, Air India jobs on 10th class, Air India kannur airport, Air India contract jobs, Air India customer agent jobs, Air India executive jobs, Air India cabin service agent jobs, Air India ramp service agent jobs, government jobs

Air India Air Transport Services Limited (AIATSL) invites application from Nationals who meet with the requirements stipulated herein, for ground duties at Kannur Airport on Fixed Term Contract for a period of three years.

ఎయిరిండియాలో ఉద్యోగాలోచ్.. పది చాలు.. ఆపై వున్నా మేలు

Posted: 04/11/2018 12:03 PM IST
Air india recruitment for kannur airport apply now for 518 various vacancies

కేరళలోని కన్నూరు ఎయిర్ పోర్టులో వివిధ కేటగిరీల్లో పనిచేసేందుకు ఎయిరిండియా ఔత్సాహికుల నుంచి ధరఖాస్తులు కోరుతుంది. మూడేళ్ల కాలపరిమితితో ఔట్ సోర్సింగ్ ద్వారా కాంట్రాక్టు పద్దతిలో ఎయిరిండియా 518 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్. సంబంధిత పోస్టులు, విభాగాలను బట్టి వాటికి విద్యార్హతలను పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, ఎంబీఏ లుగా నిర్ణయించారు. మే 4 నుంచి 7 వరకూ కేరళ రాష్ట్రంలోని కన్నూర్ ఎస్ ఎన్ పార్క్ రోడ్డులోని హోటల్ బ్లూనైల్ లో పోస్టుల ఆధారంగా వాకిన్ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

అప్లికేషన్ ఫీజును రూ.500 గా నిర్ణయించారు. అయితే SC, ST, మాజీ సైనికోద్యోగ కూటగిరీలకు మాత్రం అప్లికేషన్ ఫీజు లేదు. సంబంధిత వివరాల కోసం www.airindia.in  వెబ్ సైట్ ను సందర్శంచవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. అన్నీ పోస్టులకు ప్రి-ఎంప్లాయిమెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ తప్పనిసరి అని తెలిపింది. టెర్మినల్ మేనేజర్, అసిస్టెంట్ టెర్మినల్ మేనేజర్ పోస్టులకు మాత్రం ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదని తెలిపింది. పోస్టును బట్టి స్క్రీనింగ్, లిటరసీ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ట్రేడ్ టెస్ట్ ల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక జరగనుంది.

ఇక అభ్యర్థుల వయో పరిమితి విషయానికి వస్తే సీనియర్ ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ మినహా అన్ని పోస్టులకు అభ్యర్థులు 28 ఏళ్ల వయస్సుకు మించారదని పేర్కోంది. ఓబిసిలకు మూడేళ్ల వయస్సు సడలింపు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు వుంటుందని కూడా తెలిపింది. కాగా, సీనియర్ ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ పోస్టులకు మాత్రం అభ్యర్థులు 30 ఏళ్ల వయస్సు మించరాదని పేర్కొంది. తదనుగూణంగా బిసి, ఎస్సీ,ఎస్టీల సడలింపులు కూడా వుంటాయని తెలిపింది. పోస్టుల ఆధారంగా రూ.13,400 నుంచి రూ.55,000 వరకూ ఉంటుందని ఎయిర్ ఇండియా తెలిపింది.

ఖాళీల వివరాలు:

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (పాక్స్) - 7
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (టెక్నికల్) - 7
టెర్మినల్ మేనేజర్ (పాక్స్ హ్యాండ్లింగ్) - 1
టెర్మినల్ మేనేజర్ (ర్యాంప్ హ్యాండ్లింగ్) - 1
Asst. టెర్మినల్ మేనేజర్ - 1
సీనియర్ కస్టమర్ ఏజెంట్ - 22
కస్టమర్ ఏజెంట్ - 44
జూనియర్ కస్టమర్ ఏజెంట్ - 44
క్యాబిన్ సర్వీసు ఏజెంట్ - 3
జూనియర్ క్యాబిన్ సర్వీసెస్ ఏజెంట్ - 4
సీనియర్ రాంప్ సర్వీసెస్ ఏజెంట్ - 21
రాంప్ సర్వీసెస్ ఏజెంట్ - 32
యుటిలిటీ ఏజెంట్ కం-రాంప్ డ్రైవర్ - 21
హ్యాండీమాన్ / హండివామెన్ - 310

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air India  vacancies  jobs  10th class  kannur airport  contract jobs  Air India jobs  government jobs  

Other Articles