Undavalli slams PM, CM for NCM and APSS పీఎం, సీఎంలపై ఉండవల్లి ఫైర్.. 2019 తరువాత మోడీ ప్రధాని కాలేరు..

Undavalli arun kumar slams pm cm for ncm and apss

undavalli arun kumar, chandrababu naidu, andhra pradesh, narendra modi, bjp, telugudesam, vijaya sai reddy, no confidence motion, ap special status, motion of no confidence, sumitra mahajan, Andhra Pradesh, politics

Former MP Undavalli Arun Kumar slams PM Modi, Andhra Pradesh cheif Minister Chandrababu for no confidence motion and AP special status.

పీఎం, సీఎంలపై ఉండవల్లి ఫైర్.. 2019 తరువాత మోడీ ప్రధాని కాలేరు..

Posted: 03/29/2018 12:37 PM IST
Undavalli arun kumar slams pm cm for ncm and apss

ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి, రాష్ట్రాన్ని కాపాడేందుకు వెంటనే రంగంలోకి దిగాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీలో ఆయన అన్ని బిల్లులను ఒకే రోజున పాస్ చేసుకోవచ్చని, అయితే అసెంబ్లీని సద్వినియోగం చేసుకుని ఆయన అక్కడ గంటల గంటల కొద్ది మాట్లాడుతూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఇక చాలునన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు మర్యాద లేకుండా నీచంగా తిట్టారని అంగలూర్చుతూ.. మొత్తం పరిస్థితిని ఏమార్చడం సమంజసం కాదని ఆయన సూచించారు.

రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఎవరు ఏమని తిట్టినా సర్దుకు పోవాలన్నారు. వ్యక్తిగత విషయాలను వదిలి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు పోరాటం చేయాలని చెప్పారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని ముందుండి నడిపించాలని కోరారు. కేంద్రంపై న్యాయ పోరాటం చేయాలని సూచించారు. ప్రత్యేక హోదాకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులలో రిట్ పిటిషన్లు ఉన్నాయని... గత నాలుగేళ్లుగా తాను ఈ కేసుల వేసి వాటి చుట్టూ తిరుగుతున్నానని అన్నారు. వీటికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పారు. కౌంటర్ ఫైల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 24 గంటల సమయం కూడా పట్టదని అన్నారు.

చంద్రబాబు ఏరుదాటాక తెప్పతగలేసే రకమని ఉండవల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లో ఓడిపోగానే చారిత్రాక తప్పిదం చేశానని చంద్రబాబు అన్నారని, మళ్లీ 2014లో జతకట్టి.. ఇప్పుడు కేంద్రం మమల్ని మోసం చేస్తుందని ఏమార్చుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మెజార్టీ ఉన్న మోదీ అవిశ్వాసానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అసలు హోదా వద్దని ఎందుకన్నారో తెలియదు.. అర్థరాత్రి హైడ్రామా నేపథ్యంలో ఫ్యాకేజీకి అంగీకరించిన ఆ ప్యాకేజీలో ఏం ఇచ్చారన్న విషయాలను కూడా ప్రజలతో ఎందుకు పంచుకోలేదని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ దారుణంగా వ్యవహరిస్తున్నా.. అప్పుడు చూస్తూ ఉండిపోయిన బీజేపి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా, ప్రత్యేక హోదాను కల్పించకుండా అన్యాయం గురిచేసిందన్నారు. అప్పుడు కాంగ్రెస్ ను అడిపోసుకున్నాక.. ఇప్పుడు మాత్రం అదే కాంగ్రెస్ రూపొందించిన విభజన చట్టంలో వున్నవి మాత్రం ఇవ్వండీ చాలు అని నాలుగేళ్లగా అడుక్కొవడం ప్రజల దౌర్భాగ్యాంగా మార్చారని, దీంతో ఏపీ అంటే దేశవ్యాప్తంగా ఎంతటి చిన్నచూపు ఏర్పడుతుందని ఆయన అవేధన వ్యక్తం చేశారు. కేంద్రంపై ఏపీ సర్కారు న్యాయ పోరాటం చేయాలని అటు అవిశ్వాసంపై కూడా చర్చకు పట్టుబట్టాలని ఉండవల్లి నూచించారు.

అవిశ్వాసంపై చర్చ జరిగేలా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చొరవ తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో తనకున్న విచక్షణాధికారంతో తమను అప్పటి స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారని... ఇప్పుడు సభలో ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే సభ్యులను కూడా స్పీకర్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి మోడీ చెబితేనే తాను ఫళనిస్వామితో కలసానని పన్నీరు సెల్వమే చెప్పారని. ఈ క్రమంలో వారిని ఓ రోజు సభకు రాకుండా వుండమని చెప్పలేరా..? అంటూ ఆయన ప్రధానిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక మోడీ 2019 ఎన్నికల తరువాత ప్రధాని కాలేరని, అసలు బీజేపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా అవతరించదని తాను అభిప్రాయపడుతున్నానని, దేశవ్యాప్తంగా మోడీ గ్రాఫ్ పూర్తిగా తగ్గిపోయిందని ఉండవల్లి జోస్యం చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles