JanaSena Party Formation Day Maha Sabha Very Soon | జన సంద్రంగా మారిన మైదానం.. మరికాసేపట్లో జనసేన మహాసభ ప్రారంభం

Janasena party formation day maha sabha soon

JanaSena Party, Formation Day Guntur, Maha Sabha, JanaSena Maha Sabha, JanaSena Formation Day

JanaSena Party Formation Day Maha Sabha Starts Soon. Pawan Kalyan Reach Venue Very Soon.

మరికాసేపట్లో జనసేన ఆవిర్భావ మహా సభ ప్రారంభం

Posted: 03/14/2018 04:22 PM IST
Janasena party formation day maha sabha soon

జనసేన సిద్ధాంతాలు, తమ నాలుగేళ్ల ప్రయాణంపై, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై జనసేన ఆవిర్భావ దినోత్సవంగా సందర్భంగా నిర్వహించబోయే సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో సభకు తరలి వచ్చే కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్‌ మిషన్‌ ప్రాంగణ 35 ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా భారీ బహిరంగా సభ నిర్వహిస్తుండటం, ప్రత్యక్ష రాజకీయ ప్రవేశ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత ఏపీ, తెలంగాణ, ఒడిశా నుంచి వచ్చిన 200 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా.. మరికాసేపట్లో పవన్ వేదికపై చేరుకుని ప్రసంగిస్తారు.

ఇక ఈ సభ ద్వారా తమ నేత కీలక ప్రకటనతో పాటు భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తారని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ దాదాపు రెండు గంటలపాటు ప్రసంగించే అవకాశం ఉందని సమాచారం.

జనసంద్రంగా మైదానం...
అశేష అభిమానులు, కార్యకర్తలతో నాగార్జున యూనివర్సిటీ వద్ద కోలాహలం నెలకొంది. విజయవాడ వైపుగా వచ్చే వాహనాలను సాయిబాబా గుడి వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేయగా వీఐపీల వాహనాలను టోల్‌గేట్‌ వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేశా రు. గుంటూరు మీదుగా రాయలసీమ, తదితర ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తల వాహనాల పార్కింగ్‌కు కాకాని దాటిన తరువాత బైబిల్‌ మిషన్‌గ్రౌండ్‌ వెనకు భాగంలో, వీఐపీల వాహనాల పార్కింగ్‌కు రెయిన్‌ట్రీ పార్కింగ్‌ స్థలాన్ని కేటాయించామని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే రెండున్నర లక్షల మంది జన సైనికులు వేదిక వద్ద ఉండగా.. మరికొందరు దారిలో ఉన్నారు. సుమారు 5 లక్షల మంది సభకు హాజరు కావొచ్చని ఓ అంచనా.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని వెయ్యి మంది వాలంటీర్లతో మజ్జిగ, వాటర్‌ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పోలీసులు పకడ్బంది ఏర్పాట్లు చేశారు.


తాడేపల్లి నుంచి భారీ ర్యాలీ
జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా 974 మంది త్రివర్ణ పతాకధారులతో జాతీయ ఐక్యతా పాదయాత్రను నిర్వహిస్తున్నారు.  పార్టీ సమన్వయకర్త ముత్తంశెట్టి కృష్ణారావు నేతృత్వంలో ఈ ర్యాలీ జరగనుంది. ఉదయం 8 గంటలకు వారధి ఆవల తాడేపల్లి పోలీసు స్టేషన్‌ ప్రాంతం నుంచి బయలుదేరే పాదయాత్ర కాజా వద్ద సభాస్థలికి చేరుకుంటుంది. సుమారు ఐదు గంటలకు ర్యాలీ చేరుకునే అవకాశం ఉంది. ఇక నవ్యాంధ్ర రాజధానిలో స్థిర నివాసం ఏర్పరుచుకోబోతున్ననిర్మించుకోబోతోన్నతొలి రాజకీయపార్టీ నాయకుడిగా పవన్ కు క్రెడిట్ దక్కనుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles