SP widens gap over BJP; leads in yogi's Gorakhpur and in Phulpur యూపీలో బీజేపికి ఎదురుగాలి.. ఎస్పీ ముందంజ

Sp widens gap in yogi s gorakhpur by 7 000 votes races ahead in phulpur

Araria By Election Results 2018, Bhabua By Election Results 2018, Bihar By Election Result 2018, Bihar By Election Results 2018, Bihar By Polls Results 2018, By Election Result 2018, By Election Results 2018, Gorakhpur By Election Results 2018, Gorakhpur parliamentary constituency, Jehanabad By Election Results 2018, Phulpur By Election Results 2018, Samajwadi Party, Samajwadi Party-Bahujan Samaj Party, UP By Election Result 2018, Uttar Pradesh By Election Result 2018, Uttar Pradesh bypoll counting, Uttar Pradesh bypoll results, Uttar Pradesh bypolls, latest updates, latest news

Samajwadi Party candidate Nagender Singh Patel is leading by 21,402 votes in Phulpur Lok Sabha seat, BJP's Kaushlendra Singh Patel trailling with 1,34,819 votes. In CM Yogi adityanath Gorakhpur, SP's Praveen Kumar Nishad leading with 1,63,941 votes, BJP's Upendra Dutt Shukla second with 1,50,062 votes after 11th round of counting..

బలమున్న చోటే అధికార బీజేపికి ఎదురుగాలి.. ఎస్పీ ముందంజ

Posted: 03/14/2018 12:52 PM IST
Sp widens gap in yogi s gorakhpur by 7 000 votes races ahead in phulpur

ఉత్తరప్రదేశ్ లో మా బలానికి తిరుగులేదు.. గడిచిన సార్వత్రిక ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వరకు జరిగిన ఎన్నికలలో వచ్చిన ఫలితాలే మా మాటలకు నిదర్శనమని చెప్పిన కేంద్ర, రాష్ట్రాలలో అధికారంలో వున్న బీజేపికి ఓటర్లు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ ప్రాతినిధ్య వహించిన గొరఖ్ పూర్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రాతినిధ్యం వహించిన ఫూల్ పుర్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో బీజేపికి ఎదురుగాలి వీచింది. తొలి రౌండ్ నుంచి అదిక్యాన్ని ప్రదర్శిస్తున్న సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు పది రౌండ్లు ముగిసిన అనంతరం అధికార పార్టీ అభ్యర్థులపై స్పష్టమైన మెజారిటీని సాధించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఓట్ల లెక్కింపు కేంద్రాల నుంచి మీడియాను బయటకు పంపించారు. దీంతో ఫూల్ పూర్ సమాజ్ వాదీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి మీడియాను భయటకు పంపి.. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించే యత్నాలకు స్థానిక ఎన్నికల కౌంటింగ్ సిబ్బందితో కలసి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు యత్నిస్తున్నారని అరోపిస్తూ లేఖ రాశారు. దీంతో అప్పటి వరకు స్థానిక మీడియా మాత్రమే ప్రాథాన్యత ఇచ్చిన ఈ ఉప ఎన్నికలు లెక్కింపు కేంద్రాలకు జాతీయ మీడియా కూడా చేరుకోవడంతో.. పోలీసులు నిమ్మకుండిపోయారు.

ఇదిలావుండగా, కడపటి వార్తలు అందే సమయానికి ఉత్తర్ ప్రదేశ్ లోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఫుల్ పూర్, గోరఖ్ పూర్ లలో సమాజ్ వాదీ పార్టీ స్పష్టమైన అధిక్యతను సొంతం చేసుకుని విజయం దిశగా పరుగులు వేస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం ప్రతినిత్యం వహిస్తున్న ఫుల్ పూర్ లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి సుమారు 21 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా, అటు సీఎం యోగి అధిత్యనాథ్ ప్రతినిధ్యం వహిస్తున్న గోరఖ్ పూర్ లో బీజేపి అభ్యర్థిపై సమాజ్ వాదీ అభ్యర్థి 14 వేల 648 ఓట్ల మెజారిటీతో విజయం దిశగా దూసుకుపోతున్నారు.

ఇదిలావుండగా, బీహర్ లో మాత్రం బీజేపి తన ఇంతకుముందు ఎన్నికలలో కైవసం చేసుకున్న స్థానాలను తిరిగి నిలుపుకునే దిశగా కోనసాగుతుంది. బీహార్ లోని ఆరార్యా లోక్ సభ స్థానంలో అది నుంచి అధిపత్యం ప్రదర్శించిన బీజేపి.. కౌంటింగ్ కీలక దశకు చేరుకోగానే వెనకంజలోకి జారుకుంది. ఈ నెల 11న జరిగిన ఉప ఎన్నికలలో అర్జేడీ అభ్యర్థి సర్పరాజ్ అలామ్.. బీజేపి అభ్యర్థి ప్రదీప్ కుమార్ సింగ్ పై 23 వేల ఓట్ల అధిక్యంలో దూసుకెళ్తున్నారు. దీంతో ఈ స్థానాన్ని తిరిగి అర్జేడీ నిలబెట్టుకుంటుందని అంచనాలు సాగుతున్నాయి.

ఇక బీహార్ లోని రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో బీజేపి అర్జీడి పార్టీలు తమ స్థానాలను నిలబెట్టకునే దిశగా సాగుతున్నాయి. భాభువా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపికి చెందిన రింకి రాణీ పాండే అధిక్యంతో దూసుకెళ్తుండగా, జెహనాబాద్ అసెంబ్లీ స్థానంలో అర్జేడీ అభ్యర్థి కుమార్ క్రిష్ణ మోహన్ యాదవ్ విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే యూపీ లోని రెండు, బీహార్ లోని ఒకటి కలుపుకుని మొత్తంగా మూడు లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో మోడీ మానియా మసకబారిందా..? యోగి చరిష్మ అంటకాగిందా..? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles