T Congress Chief Satires on CM KCR Third Front | ఫెడరల్ ఫ్రంటూ లేదు, మన్నూలేదు.. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పై సెటైర్లు

T congress on kcr third front comments

Telangana, Congress Party, Uttam Kumar Reddy, Chief Minister, KCR, Third Front, Satires

Telangana Congress Party Chief Uttam Kumar Reddy Satires on CM KCR Third Front. KCR fear for PM Modi from Past Four Years. Now Third Front is Big Joke Uttam Added.

‘థర్డ్ ఫ్రంట్ లేదు.. ఏదీ లేదు’

Posted: 03/05/2018 09:47 AM IST
T congress on kcr third front comments

జాతీయ పార్టీలు(కాంగ్రెస్, బీజేపీలను ఉద్దేశించి) దేశానికి చేసిందేమీలేదని... థర్డ్ ఫ్రంట్ అనివార్యమని, దానికి నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలంగాణ ముఖ్యమంతి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై టీఎస్ పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా బోధన్, నిజామాబాద్‌ లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ, నాలుగేళ్లుగా ప్రధాని మోదీ అంటే కేసీఆర్ గడగడ వణికారని అన్నారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతోపాటు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విషయంలో బీజేపీ సర్కారుకు మద్దతిచ్చిన కేసీఆర్, ఇప్పుడు ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ కొత్త నాటకానికి తెరదీశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఒక్క ఎంపీ సీటూ గెల్చుకోలేరని, అలాంటి కేసీఆర్ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎలా ఏర్పాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంటూ లేదు, మన్నూలేదు అంటూ ఆయన వెటకారమాడారు.

నాలుగు వేల మంది రైతులు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించేందుకు కూడా వెళ్లని కేసీఆర్, అకస్మాత్తుగా రైతులను ఉద్ధరిస్తానని చెబితే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్‌ లో రైతు ఉత్పత్తుల కొనుగోళ్లకు నిధులెందుకు కేటాయించలేదని ఆయన అడిగారు. మరో వైపు బీజేపీ కూడా థర్డ్ ఫ్రంట్ కు టెంట్ కూడా దొరకదంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles