Tensions at Nagarjuna Sagar Dam | సాగర సమరం.. ఏపీ, తెలంగాణ అధికారుల మద్య కొట్లాట

Tension at nagarjuna sagar dam

Nagarjuna Sagar Project, Andhra Pradesh, Telangana, Water Sharing, Nagajuna Sagar Dam Police

The dispute between Andhra Pradesh and Telangana over sharing water from the Nagarjuna Sagar reservoir escalated on Wednesday, With irrigation officials Clash Police from Both States Deployed at Project.

నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తత

Posted: 02/28/2018 02:08 PM IST
Tension at nagarjuna sagar dam

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులు బుధవారం ప్రాజెక్టు వద్దకు చేరుకుని వాగ్వివాదానికి దిగడంతో అల‌జ‌డి చెల‌రేగింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కృష్ణా బోర్డు 10.5 టీఎంసీల నీటిని కేటాయించడంతో ఇప్పటివరకు 10.2టీఎంసీలను కుడికాల్వ ద్వారా అధికారులు విడుదల చేశారు.

మరో 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉండ‌గా తెలంగాణ అధికారులు అడ్డుకున్నారని ఆంధ్రప్ర‌దేశ్ అధికారులు ఆరోపిస్తున్నారు. దీంతో ఉద్రిక్త‌తలు చెల‌రేగ‌కుండా అక్క‌డ‌ ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా మోహరించారు.

ప్రస్తుతం ఆంధ్ర‌, తెలంగాణ అధికారులు చర్చలు జ‌రుపుతున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ నిర్ణయించిన నీటికంటే ఎక్కువ వాడుకొందని తెలియ‌డంతో ఇటీవ‌ల నీటి విడుదలను నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశించింది. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles