astologers need to get clarity on sankranti ‘సంక్రాంతి’పై వాళ్లకే క్లారిటీ రాలేదు..

Astrologers dilema on sankrati date makes devotees confused

astrologers, krishna pushkaralu, sankranti, pongal, hindu festivals, devotees, Telangana, andhra pradesh

In Recent times many astrologers divide on celebrating hindu festivals, their decision makes devotees confused

‘సంక్రాంతి’పై వాళ్లకే క్లారిటీ రాలేదు.. ఇక వీళ్లకేం స్పష్టతనిస్తారు..?

Posted: 01/03/2018 09:52 AM IST
Astrologers dilema on sankrati date makes devotees confused

హిందూ పండుగల విషయంలో ఇటీవల పంచాంగకర్తల మధ్య తరచూ భేదాభిప్రాయాలు వస్తున్నాయి. వీరి మధ్య సమన్వయం కోసం గత ఏడాది పంచాంగకర్తల సమావేశాలు నిర్వహించగా అశాజనకంగానే ముగిసినా.. మళ్లీ సమస్య మాత్రం పునారవృతమైంది. గత కొన్నేళ్లుగా పండుగల విషయంలో పంచాంగకర్తలు మధ్య వత్యాసాలు పోడసూపుతున్నాయి. దీంతో పండుగులపై పంచాంగకర్తలకే క్లారిటీ లేకపోవడంతో.. భక్తులు డోలాయమానంలో పడుతున్నారు.

ఏ రోజున పండుగలను జరుపుకోవాలన్న విషయంలో భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. కృష్ణా పుష్కరాల నుంచి ఉగాది వరకు ఇలా ప్రతీ పండగ కూడా సరైన స్పష్టతను కోల్పోయింది. అసలు ఏ రోజున పండుగలు జరుపుకోవాలి.. ఎవరి మాటలను అచరించాలన్న విషయం తెలియక హైందవులు తికమకపడుతున్నారు.  ఒకరు ఒక రోజున చేయాలంటే మరొకరు ఇంకో రోజున చేయాలంటూ వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి విషయంలోనూ మరోమారు పంచాంగకర్తల మధ్య భేదాభిప్రాయాలు పొడసూపాయి. పండుగ ఎప్పుడు అన్నదానిపై ఎవరికి వారే భిన్న వాదనలు వినిపిస్తున్నారు.

జనవరి 14న మధ్యాహ్నం 1:46 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆ రోజే మకర సంక్రాంతి అని ధృక్ సిద్ధాంత పంచాంగకర్తలు చెబుతున్నారు. భారత సిద్ధాంత పంచాంగం కూడా ఇదే విషయాన్ని చెబుతోందని అంటున్నారు. అయితే సంకాంత్రి 14న కాదని, ఆ రోజు సాయంత్రం 7:43 గంటలకు మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఆ మర్నాడే మకర సంక్రమణ ప్రయుక్త పుణ్యకాలమని మరికొందరు పంచాంగకర్తలు వాదిస్తున్నారు.

క్యాలెండర్లు అన్నీ 15నే మకర సంక్రాంతి అని ప్రచురించాయి. 14న భోగి, 15న  సంక్రాంతి, 16న కనుమ జరుపుకోవాలని గంటల పంచాంగాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, అంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా 15నే సంక్రాంతి పండుగగా పేర్కోని.. వాటినే పరిగణలోకి తీసుకుని ఉద్యోగ, విద్యాసంస్థలకు సెలవు దినాలను ప్రకటించింది. దీని అధారంగా 14న భోగి, 16న కనుమ పండుగలను జరుపుకోవాలి. అయితే ప్రతీ ఏడా కావాలనే సంక్రాంతి పండుగ నుంచి పంచాంగకర్తల మధ్య బేధాభిప్రాయాలు ఉత్పన్నమవుతున్నాయని, దీంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారన్న విమర్శలకు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : astrologers  krishna pushkaralu  sankranti  pongal  hindu festivals  devotees  Telangana  andhra pradesh  

Other Articles