Fourteen injured by car in Melbourne's CBD డ్రగ్స్ మత్తులో జనాలపైకి కారు.. 14 మందికి గాయాలు

Melbourne incident the act of mentally ill drug addict

Commander Russell Barrett, pedestrians, car hits crowd, suspected terror attack, islamic militants, australia news, pedestrians , car hits crowd, Car, Rams, People, Sidewalk, melbourne, Australia, crime

An S.U.V. plowed into a crowd on a busy street in central Melbourne on Thursday, injuring at least 14 people, including a child, in what the police called “a deliberate act.”

డ్రగ్స్ మత్తులో జనాలపైకి కారు.. 14 మందికి గాయాలు

Posted: 12/21/2017 03:56 PM IST
Melbourne incident the act of mentally ill drug addict

ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం సంభవించింది. అస్ట్రేలియాలోని ని మెల్‌బోర్న్‌ నగరంలోని ఫ్లిండర్స్ అండ్ ఎలిజబెత్ వీధిలో.. రహదారిపై నుంచి వేగంగా వెళ్తున్న ఓ కారు ప్రజలపైకి దూసుకెళ్లింది. వేగనియంత్రణ కోల్పోవడంతో.. అదుపు తప్పి ఏకంగా సైడ్ వాక్ లో నడుస్తున్న జనాలపైకి దూసుకెళ్లడంతో   సుమారుగా 15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారి గాయాలు, హాహాకారాలతో అక్కడంతా విషాధ వాతావరణం అలుముకుంది.

కాగా ఇది ఉగ్ర చర్యేనని భావించిన అక్కడున్నవారంతా భయకంపితులయ్యారు. అయితే కేవలం యాధృచ్ఛీకంగానే జరిగిన ఘటనని పోలీసులు తేల్చారు. కారును మతిస్థిమితం సరిగా లేని మత్తుమందు సేవించిన వ్యక్తులు నడిపారని దీంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా కారు ప్రమాదంలో క్షతగాతులైన వారని ఆసుప‌త్రుల్లో చికిత్స అందుతోంది. గాయ‌ప‌డ్డ వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌తో ఆ ప్రాంతంలో మెట్రో ప్రయాణాలను తాత్కాలికంగా ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. కారు త‌మ‌పైకి దూసుకువ‌స్తుండ‌డంతో జనం అంతా ప్రాణ భయంతో పరుగులు తీశారు.

తెలుపు రంగు సుజుకీ ఎస్‌యూవీలో ఇద్దరు వ్యక్తులు ముందు సీటులో కూర్చున్నార‌ని, ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తూ దూసుకొచ్చార‌ని ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో ఆ ప్రాంత‌వాసులంతా తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఈ ఏడాది మొద‌ట్లో మెల్‌బోర్న్‌లోని రద్దీగా ఉండే ఓ షాపింగ్‌ మాల్‌ వద్ద కారు పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఆరుగురు మృతి చెందారు. అదే మెల్‌బోర్న్‌లో మ‌ళ్లీ ఇటువంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. నిందితుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. నిందితులు ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్ప‌డి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఉగ్ర చర్యా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles