T Minister Lost His Mobile Phone in KCR's Tour | కేసీఆర్ పర్యటనలో హరీశ్ కు ఊహించని ఝలక్

Harish rao lost mobile

Harish Rao, Telangana Minister, CM KCR, Harish Rao Lost Mobile, Kannepalli Pump House Works, T Minister Harish Rao, Jerk to Harish Rao, KCR Kaleshwaram Project Works

Telangana Irrigation Minister Harish Rao Lost his Mobile. He attend to CM KCR Inspection at Kannepalli Pump House Works. While return Harish lost his mobile.

మంత్రి హరీశ్ రావుకు ఊహించని ఝలక్

Posted: 12/08/2017 08:49 AM IST
Harish rao lost mobile

తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తన సెల్ ఫోన్ పోగొట్టుకొని వార్తల్లో కెక్కారు. గురువారం కన్నెపల్లి పంప్‌హౌస్ నిర్మాణ పనులను పరిశీలించిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం ఆయన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నెపల్లి పంప్‌హౌస్ పనులను పరిశీలించి వెళ్తున్న సమయంలో హరీశ్ తన మొబైల్‌ను పోగొట్టుకున్నారు. కారులో కొంత దూరం వెళ్లిన తర్వాత ఫోన్ పోగొట్టుకున్న విషయాన్ని గుర్తించిన మంత్రి తిరిగి వెనక్కి వచ్చారు. కారు దిగి స్వయంగా ఫోన్ కోసం చాలాసేపు వెతికారు. ఆ

యనకు సెక్యూరిటీ సిబ్బంది, ఇతర అధికారులు సాయం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా, గత కొన్ని నెలలుగా ఆయన క్రియాశీలకంగా వ్యవహరించటం లేదు. హైదరాబాద్ మెట్రో ప్రారంభం, జీఈఎస్-2017, ఇలా ఏ అంశంలోనూ ఆయన జోక్యం చేసుకోకపోవటంతో రకరకాల కథనాలు వెలువడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles