driver chased on bike, as train travels 13 kms రైలు కదిలి వెళ్లింది.. బైక్ పై చేస్ చేసిన డ్రైవర్..

Mumbai chennai train engine travels 13 km without driver

Mumbai Mail, train engine, karnataka, kalaburgi, driver 13 km run, driverless electric engine, wadi station

A driverless electric engine, proved 'unstoppable' as it ran 13 km from Wadi station in Kalaburagi before it was brought to a halt.

రైలు కదిలి వెళ్లింది.. బైక్ పై చేస్ చేసిన డ్రైవర్..

Posted: 11/09/2017 09:12 PM IST
Mumbai chennai train engine travels 13 km without driver

డ్రైవర్ లేకుండానే రైలు ఇంజిన్ పరుగులు తీసింది. ఇవాళ కర్ణాటకలోని వాడి జంక్షన్ లో ఎలక్రిక్ నుంచి డీజిల్ ఇంజిన్ ను మార్చారు. అయితే ఇలా మారిన వెనువెంటనే ఆటోమెటిక్ గా స్టార్టయిన ఆ డీజిల్ ఇంజిన్.. డ్రైవర్ లేకుండానే ఏకంగా 13 కిలోమీటర్ల వరకు వెళ్లింది. ఇది గమనించిన రైల్వే సిబ్బంది బైక్ తో ఛేజ్ చేసి, రైలులోకి ప్రవేశించి ఇంజిన్ ను కంట్రోల్ చేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో రైల్వై అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

సిగ్నల్స్ బాగానే పని చేస్తున్నప్పటికీ..డ్రైవర్ లేకుండానే ఇంజిన్ వెళ్లడంతో సాఫ్ట్ వేర్ కూడా అయోమయంగా తయారైందన్నారు అధికారులు. దీంతో నెక్ట్స్ స్టాప్ వారికి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చామని, లేకుంటే ఆగివున్న రైలును ఢీకొనే ప్రమాదం ఉండేదని చెప్పారు. వాడి నుంచి సోలాపూర్ మధ్యన ఈ ఘటన చోటుచేసుకుందని, ఆ రైలు చెన్నై నుంచి ముంబైకి వెళ్లాల్సి ఉందన్నారు. వాడి నుంచి సోలాపూర్ మీదుగా ఎలక్రికల్ మార్గం లేనందున వాడి జంక్షన్ లో డీజిల్ ఇంజిన్ మార్చాల్సి వచ్చిందన్నారు. ఈలోపే సాంకేతికలోపంతో రైలు పరుగులు తీసిందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles