IndiGo staff manhandle passenger, airline apologises ప్రయాణికుడిపై దాడి.. వీడియో వెలుగుచూడటంతో సారీ..

Indigo staff manhandle passenger airline apologises

indigo passenger delhi,indigo manhandled passenger,indigo manhandled,indigo delhi incident,Indigo

In a shocker, IndiGo ground staff manhandled and dragged a passenger at the Delhi Airport on October 15. The passenger, identified as Rajiv Katyal, had flown in from Chennai on 6E 487.

ప్రయాణికుడిపై దాడి.. వీడియో వెలుగుచూడటంతో సారీ..

Posted: 11/07/2017 09:06 PM IST
Indigo staff manhandle passenger airline apologises

విమానయాన సిబ్బందిపై ప్రయాణికులు కొంచెం దురుసుగా ప్రవర్తిస్తే అమల్లోకి వచ్చే నో ఫ్లై జాబితా, శిక్షలు, ఇతరాత్రలు.. అదే విమాన సిబ్బంది ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం అమల్లోకి రావు. అంతా లైట్ గా తీసుకుంటారు. ఒకవేళ జరగకూడనిది ఏదైనా జరిగితే.. తాపీగా ఓ సారి పడేస్తే పోలా... అన్నట్లుంది విమానయాన సిబ్బంది వ్యవహారం. ఒకరు కాదు ఇద్దరు విమాన సిబ్బంది ఓ నడి వయస్కుడైన వ్యక్తిపై దాడి, పిడిగుద్దులతో తెగబడ్డారు. అయితే ఈ ఘటన తాలుకు వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో విమాన సంస్థ తాపీగా సారి చేప్పేసింది.

న్యూఢిల్లీ విమానాశ్రయంలో 53 ఏళ్ల రాజీవ్ కటియాల్ అనే ప్రయాణికుడి పట్ల టార్మాక్ సిబ్బంది ప్రవర్తించిన తీరు.. ఇప్పుడ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి నిదర్శనం. దీపావళి ముందు రోజు ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగు చేసింది, ఓ ఆంగ్ల చానల్ ఈ వీడియోను ఇవాళ ప్రసారం చేయడంతో మొత్తం ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే విమాన సంస్థ మాత్రం తాపీగా సారి చేప్పేసింది.
 
రాజీవ్ కటియాల్  అక్టోబరు 15న  ఇండిగో విమానంలో  న్యూఢిల్లీ వెళ్ళారు. విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన టార్మాక్ వద్ద ఉన్న బస్సుల వద్దకు వెళ్ళారు. అక్కడ తీవ్రమైన ఎండ వేడి ఉండటంతో సమీపంలోని చెట్టువద్ద నిల్చున్నారు. ఆయన నో ఎంట్రీ జోన్‌లో నిల్చున్నట్లు టార్మాక్ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆయనతో దురుసుగా మాట్లాడారు. ఆయన వారితో ‘‘మీ పని మీరు చూసుకోండి’’ అని అన్నారు. ఆ తర్వాత ఇద్దరు టార్మాక్ సిబ్బంది ఆయనను అక్కడి బస్సు ఎక్కకుండా నిలువరించారు.

ఆయన బస్సు వద్దకు వెళ్ళే ప్రయత్నం చేయగా, టార్మాక్ సిబ్బంది నిర్దయగా ఆయనను వెనుకకు లాగేశారు. ఆయన వారి పట్టును వదిలించుకునేందుకు ప్రయత్నించగా, ఆ ఇద్దరూ ఆయనను క్రింద పడేసి పిడిగుద్దులు కురిపించారు. ఆయన తలపై ఒకడు కాలు పెట్టాడు. మరొకడు ముఖంపై గుద్దాడు. కొంతసేపటి తర్వాత ఆయనను మరొకడు వచ్చి విడిపించాడు. ఆయనను కొడుతున్న సమయంలో ఆ ఇద్దరు సిబ్బంది చాలా సంతోషంగా, నవ్వుతూ కనిపించారు. దీనిపై డీజీసీఏ ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. 21 రోజుల తర్వాత ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles