’PM Modi accept your blunder' asks Manmohan Singh ‘‘ఇప్పటికైనా దేశ ప్రజలకు ఆ తప్పుల గురించి చెప్పండీ’’

Pm modi accept your blunder asks manmohan singh

Manmohan Singh, Narendra Modi, Manmohan demonetisation, Manmohan Gujarat visit, demonetisation, catastrophic economic policy, organised loot, legalised blunder, Gujarat elections, Rahul Gandhi, Gujarat polls,

Former prime minister Manmohan Singh, attacked the Narendra Modi government over its economic policies like demonetisation and GST.

మోదీ నిర్ణయాలు అశనిపాత అర్థిక విధానాలే..

Posted: 11/07/2017 10:50 AM IST
Pm modi accept your blunder asks manmohan singh

వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ లో అధికారమే ధ్యేయంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఓ వైపు రాహుల్ తన సభలు సమావేశాలతో క్షణం తీరిక లేకుండా బిజీ షెడ్యూల్డు మధ్య గడిపేస్తుంటే.. ఇక ఆయనకు మద్దత్తుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఇవాల కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు. గుజరాత్ పర్యటనలో వున్న ఆయన ఇవాళ అక్కడి వ్యాపారస్థులు, వాణిజ్యవేత్తలతో సమావేశం కానున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ వైపైల్యాలను తీవ్రంగా ఎండగట్టారు. మోదీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు గా చెప్పుకుంటున్న జీఎస్టీ అమలు, నోట్ల రద్దు దేశ అర్థిక సంస్కరణలు ఎంతమాత్రం కావని ఆయన తేల్చిచెప్పారు. కాగా మోడీ ప్రభుత్వ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు అశనిపాతంలా పరిణిమించాయని.. ఇవి భారత వ్యవస్థ ను తీవ్ర విపత్తులోకి తీసుకెళ్లాయని దుయ్యబట్టారు. ఈ రెండూ మోదీ చేసిన అతిపెద్ద తప్పులని, ఇప్పటికైనా, మోదీ తన తప్పును అంగీకరించాలని మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు.

మోదీ నిర్ణయాలు భారత వ్యవస్థకు విపత్తులను తెచ్చి పెట్టాయని, ఇండియా వంటి దేశంలో తొందరపాటు నిర్ణయాలు ఎలాంటి వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయన్న విషయం మోదీ అమలులోకి తెచ్చిన నోట్లరద్దు, జీఎస్టీతో బహిర్గతమైందని ఆరోపించారు. ఈ రెండు నిర్ణయాలు దేశ అర్థిక వ్యవస్థపైనే కాకుండా అనేక అంశాలకు విపత్తును అపాదించి పెట్టాయని ఆయన అన్నారు. ఈ నిర్ణయాలతో దేశం అర్థిక, సామాజిక, పరపతి, పేరు, వ్యవస్థపరంగా నష్టపర్చిందని ఆయన అగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ తప్పుడు నిర్ణయాల ప్రభావం దేశంలోని బడుగు వర్గాలపై భారీగా పడుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ. తాను చేసిన అతిపెద్ద తప్పును దేశ ప్రజలకు ఎదుట అంగీకరించి, భారత వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కృషి చేయాలని, లేకుంటే, ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని ఆయన ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారు. నోట్ల రద్దు అన్నది సంస్థాపరంగా జరిగిని లూటీ అని, చట్టబద్దంగా జరిగిన తప్పని ఆయన మండిపడ్డారు. గుజరాత్ లో బీజేపీ ఓటమి ఖాయమని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles