PV Sindhu Tweets About Rude Behaviour of Airlines Staff | విమాన సిబ్బంది అనుచిత ప్రవర్తన.. సింధు ట్వీట్. నిజం కాదన్న ఇండిగో

Pv sindhu slams indigo ground staff

PV Sindhu, PV Sindhu Indigo Ground Staff, PV Sindhu Ajeetesh, PV Sindhu IndiGo Airlines, PV Sindhu Tweets, PV Sindhu News, IndiGo Airlines

Indian badminton star PV Sindhu on Saturday slammed IndiGo airlines for the treatment dished out to her by one their employees on her way to Mumbai. The Olympics silver-medallist took to twitter to talk about the matter. In a series on tweets, Sindhu spoke about her ordeal.

పీవీ సింధుతో అనుచిత ప్రవర్తన... ట్వీట్లు వైరల్

Posted: 11/04/2017 03:27 PM IST
Pv sindhu slams indigo ground staff

హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకి చేదు అనుభవం ఎదురైంది. ముంబైకి విమానంలో వెళ్తున్న గ్రౌండ్ స్టాఫ్ సిబ్బంది తనతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసి కలకలమే రేపింది. అజితేష్ అనే సిబ్బంది తనతో అనుచితంగా ప్రవర్తించాడంటూ ట్వీట్ చేసి కలకలమే రేపింది.

తనతోపాటు ప్రయాణికులందరితో అతను అలాంటి ప్రవర్తనే చేశాడని పేర్కొంది. ఇలాంటి వారు ఉంటే ఎయిర్ లైన్స్ కు తీవ్ర నష్టమంటూ ఆమె మొత్తం మూడు ట్వీట్లు చేసింది. అయితే ఏం జరిగిందో ఆమె పూర్తిగా చెప్పకుండా రెండు ట్వీట్ లను డిలేట్ చేయటం విశేషం. కాసేపటికే కావాలంటే అషిమాతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటూ ఆమె మరో ట్వీట్ చేసింది.

 

స్పందించిన ఇండిగో...

సింధు ట్వీట్ దుమారంపై ఇండిగో యాజమాన్యం స్పందించింది. తమ సిబ్బంది నిబంధనల మేరకే నడుచుకున్నారని.. సింధు ఆరోపణల్లో నిజం లేదని తేల్చింది. సింధు అధిక ల‌గేజీతో ప్ర‌యాణానికి సిద్ధ‌మ‌య్యార‌ని పేర్కొంది. తాము ఆ అధిక ల‌గేజీని కార్గోలోకి మారుస్తామ‌ని సింధుకి చెప్పామ‌ని తెలిపింది. మొద‌ట ల‌గేజీని కార్గోలోకి త‌ర‌లించేందుకు సింధు అంగీక‌రించ‌లేద‌ని, చాలాసార్లు కోరిన అనంత‌రం కార్గోలోకి త‌ర‌లించేందుకు సింధు అంగీక‌రించార‌ని ఇండిగో యాజ‌మాన్యం వివ‌ర‌ణ ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles