Organiser among three held in brothel raid బాలికలతో బలవంతంగా.. మళ్లీ పట్టుబడిన నిషా ఖాన్..

Organiser among three held in brothel raid in upparpally

nisha khan arrested, nisha khan held in uppal, brothel house organiser nisha khan, upparpally, rajendranagar, nisha khan, Moghalpura, Muradnagar, brothel house, minor girls, hyderabad, Telangana, crime

The telangana police have arrested three persons including a woman for operating a brothel house in happy homes appartments in uppal area.

బాలికలతో బలవంతంగా.. మళ్లీ పట్టుబడిన నిషా ఖాన్..

Posted: 10/20/2017 05:18 PM IST
Organiser among three held in brothel raid in upparpally

హైదరాబాద్ బ్రోతల్ హౌజ్ నిర్వాహకురాలు నిషా ఖాన్.. ఈమెపై హైదరాబాద్ కమీషనరేట్ పోలిస్ స్టేషన్ల పరిదిలో కేసులు వున్నాయి. అమె అరెస్టయిన ప్రతీసారి తన అడ్డాను మరో పోలిస్ స్టేషన్ ఫరిధిలోకి మార్చి.. మళ్లీ అదే పాడు పనికి తెరలేపుతుంది. అత్యంత నీచమైన విషయం ఏంటంటే తన పాతికేళ్ల కొడుకు మద్దతుతోనే ఈమె వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తుంది.

పాతబస్తీకి చెందిన నిషాఖాన్.. ఆ మధ్య మఘట్ పురా పోలిస్ స్టేషన్ పరిధిలో పట్టుబడింది. ఆ తరువాత తన మకాం మరాద్ నగర్ కు మార్చి.. అక్కడా అదే దందాకు తెరలేపింది. ఇక అక్కడ కూడా పట్టుబడిన తరువాత తాజాగా తన అడ్డాను ఉప్పర్ పల్లికి మార్చింది. ఇక ఇక్కడ కూడా నిషాఖాన్ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తుందన్న సమాచారం అందుకున్న పోలీసులు అకస్మికంగా దాడి చేసి నలుగురు అమ్మాయిలకు విముక్తి కల్పించి.. ముగ్గురు విటులతో పాటు నిర్వాహకురాలు నిషా ఖాన్ ను అరెస్టు చేశారు.

మైనరిటీ తీరని బాలికలతో వివాహం జరిగిన తరువాత భర్తలు శృంగారం చేస్తేనా.. దానిని నేరంగా పరిగణిస్తామని సాక్ష్యాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం.. తీర్పను వెలువరించినా.. మైనర్ బాలికలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తూ.. ధనార్జనే పరమావధిగా మార్చుకుంది. గతంలో పలుమార్లు అరెస్టైనా.. ధనార్ఝనకు తాను ఎంచుకున్న వ్యభిచార మార్గాన్ని మాత్రం వీడటం లేదు. కాగా అమె వ్యభిచార గృహం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలు.. అమె అడగాలపై పోలీసులను అశ్రయించడంతో.. మరోమారు నిషాఖాన్ అరెస్టైయ్యింది.

వివరాల్లోకి వెళ్తే.. గతంలో వ్యభిచారులను తీసుకువచ్చి బ్రోతల్ హౌజ్ లను నిర్వహించే నిషాఖాన్ పాతబస్తి పరిసర పోలిస్ స్టేషన్ల పరిధిలో అమెపై కేసులు నమోదు కావడంతో కొత్త పంథాను ఎంచుకుంది. పేద బాలికల తల్లిదండ్రులకు డబ్బు అశ చూపి వారిని.. పనికోసమే తీసుకెళ్తున్నానంటూ నమ్మబలికి.. కొనుగోలు చేసుకుని తన వెంట తీసుకుని వచ్చి.. మైనర్ బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తుంది. ఇద్దరు బాలికలు ఈ గృహంతో విటుల భాధను భరించలేక పారిపోయి పోలిసులకు పిర్యాదు చేయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.

బాలికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూపీ లాగిన పోలీసులు..ఈ సారి అమె ఏకంగా తన అడ్డాను ఉప్పల్ ప్రాంతానికి మార్చిందని తెలుసుకున్నారు. అక్కడ హ్యాపీ హోమ్స్ లో ఒక అపార్టుమెంటును అద్దెకు తీసుకున్న నిషా ఖాన్, అందులోనే వ్యభిచార గృహాన్ని నడుపుతోందని తెలుసుకుని అకస్మికంగా తనిఖీలు చేపట్టారు. పోలీసుల దాడి చేయగా, ముగ్గురు విటులు, నలుగురు అమ్మాయిలతో కలసి నిషాఖాన్ పట్టుబడింది. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు నిషా ఖాన్ నేతృత్వంలో నడుస్తున్న ఇతర వ్యభిచార గృహాలపై దృష్టిని సారించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uppal  rajendranagar  nisha khan  Moghalpura  Muradnagar  brothel house  minor girls  hyderabad  crime  

Other Articles