Man made to spit and lick in Bihar ఇది మనుషుల చేసే పనియేనా..?

Man thrashed forced to spit lick saliva as punishment

Ajaipur, Mahesh Thakur, Nalanda district, Noorsarai, Sarpanch, Surendra Yadav, Nalanda, Nalanda man beaten, Noorsarai, Nand Kishore Yadav, Nitish Kumar, Bihar, crime

In yet another shocking incident of apathy, an elderly man was allegedly made to spit and then lick his saliva off the floors as a punishment for entering a Sarpanch's house without knocking.

అమానవీయం: ఇది మనుషుల చేసే పనియేనా..?

Posted: 10/20/2017 10:27 AM IST
Man thrashed forced to spit lick saliva as punishment

బీహార్ లో మరోమారు అటవిక న్యాయం యావత్ దేశ ప్రజలను విస్మయానికి గురిచేసింది. మనిషన్నవాడు ఎవరూ చేయని తరహాలో అక్కడ ఓ నాయి బ్రహ్మణుడికి శిక్షన విధించిన వైనం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. అధికారం వుందన్న అహంభావంతో ఆ గ్రామ సర్పంచ్ చేసిన చర్యలపై విమర్శలు వ్యక్తంకాగా, బీహార్ రాష్ట్రమంత్రి నందకిషోర్ కూడా స్పందించారు. ఈ ఘటనలో నిందితులందరిపై కేసులు నమోదు పెడతామని చెప్పారు.

ఇంతకీ బీహార్ లో అసలేం జరిగిందంటే.. పొరిగింట్లో వుండే వ్యక్తి తన ఇంటి వాకిట్లో నేలపై వేసిన ఉమ్మివేశాడని.. అత్యంత అమానవీయంగా శిక్షను విధించారు. అతడి ఉమ్మిని అతని నాలుకతోనే నాకించి, మహిళలతో చెప్పులతో కొట్టించిన దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఠాకూర్ నాయీ బ్రాహ్మణుడు. బార్బర్ షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. బుధవారం రాత్రి ఖైనీ కోసం పొరిగింటిలో నివసించే సర్పంచ్ సురేంద్ర యాదవ్ ఇంటికి వెళ్లాడు. వెళ్తూవెళ్తూ బయట ఉమ్మి వేశాడు.

అయితే సర్పంచ్ తో వున్న చనువు కారణం చేత.. అతడింట్లోకి ఎన్నడూ తలుపు తట్టి వెళ్లని ఠాకూర్ నాయి.. అ రోజు కూడా తలుపు తట్టకుండానే లోపలికి ప్రవేశించాడు. ఆయితే అదే అతనికి బ్యాడ్ టైమ్. ఆ సమయంలో సర్పంచ్ సహా అతడింట్లో పురుషులు కూడా ఎవరూ లేరు. దీంతో అతను దురుద్దేశంతోనే తమ ఇంట్లోకి తలుపుతట్టకుండా వచ్చాడని అరోపించిన సర్పంచ్ ఇంటి మహిళలు.. దీపావళి పండుగ అని కూడా ఉపేక్షించకుండా.. పంచాయితీ పెట్టిన పరువు తీశారు. అంతటితో అగకుండా బాధితుడు సురేంద్రయాదవ్ ను మహిళల చెప్పులతో కొట్టించాడు.

అనంతరం ఘటనా స్థలానికి తీసుకెళ్లి వేసిన ఉమ్మిని నాలుకతో నాకించారు. ఈ ఘటన తాలుకూ విషయాలు మీడియా ద్వారా ఈ ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. కాగా, ఠాకూర్ దురుద్దేశంతోనే సురేంద్ర యాదవ్ ఇంటికి వెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు. అతడిని 25 సార్లు చెప్పులతో కొట్టాలని పంచాయితీలో ఆదేశించారని, తర్వాత దానిని ఐదుసార్లకు తగ్గించారని పోలీసులు తెలిపారు. ఘటనపై స్పందించిన మంత్రి నంద్ కిషోర్ యాదవ్ ఇటువంటి వాటిని సహించబోమని హెచ్చరించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajaipur  Mahesh Thakur  Nalanda district  Noorsarai  Sarpanch  Surendra Yadav  crime  

Other Articles