AP govt Release compensation to AgriGold Victims.

Andhra pradesh government plans to give agrigold to essel

Andhra Pradesh, Agrigold Issue, Agrigold Compensation, Chandrababu Naidu Agrigold, Zee group Agrigold Take Over, Agrigold Zee Group Subash Chandra, Agrigold Victims, Subash Chandra Agrigold, Subash Chandra Agrigold Victims

Andhra Pradesh government plans to give Agrigold to Essel AgriGold issue: govt. releases ₹1 cr. towards compensation. Zee Group Take Over Agri Gold Procedure.

అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. టేకోవర్ కు వాళ్లు రెడీ!

Posted: 09/11/2017 07:35 AM IST
Andhra pradesh government plans to give agrigold to essel

అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారం చెల్లించే పనిలోకి ఏపీ ప్రభుత్వం దిగిపోయింది. కోటి రూపాయాల చోప్పున 20 మందికి ఇచ్చేందుకు ప్రభుత్వం జీవో పాస్ చేసినట్లు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోషియేషన్ ప్రెసిడెంట్ ముప్పల నాగేశ్వరరావు ప్రకటించారు. చైతన్య యాత్ర పేరిట టూర్ నిర్వహించి బాధితులందరికీ పరిహారం అందేలా చూస్తామని ఈ సంధర్భంగా ఆయన తెలిపారు.

ఇక ప్రజల నుంచి వందల కోట్ల విలువైన డిపాజిట్లు కట్టించుకుని ప్లేట్ తిరగేసిన అగ్రిగోల్డ్ ను టేకోవర్ చేసేందుకు జీ గ్రూప్ ఆసక్తిగా ఉందని సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అగ్రీగోల్డ్ అధీనంలో ఉన్న భూములను మంచి ధర ఇచ్చి కొనుగోలు చేసేందుకు జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర ఆసక్తిని చూపుతున్నారని చంద్రబాబు తన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు. క్యాబినెట్ సమావేశంలో అగ్రీగోల్డ్ ఆస్తులను జీ గ్రూప్ కొనుగోలు చేయనుందని ఆయన తెలిపారు. దీన్ని పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు.

ఇటీవల తనను కలిసిన సుభాష్ చంద్ర, ఈ ప్రతిపాదన తీసుకువచ్చారని, బాధితులకు న్యాయం జరుగుతుందంటే, తనకు అభ్యంతరం లేదని చెప్పానని ఆయన అన్నారు. వేలం ప్రక్రియ నత్త నడకన సాగుతోందని, దీంతో బాధితుల్లో ప్రభుత్వంపై నమ్మకం సడలుతోందని ఓ మంత్రి క్యాబినెట్ సమావేశంలో ప్రస్తావించిన వేళ, చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. బాధితులకు న్యాయం జరుగుతుందన్న పక్షంలో కోర్టుల నుంచి సైతం పెద్దగా అడ్డంకులు ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, డిపాజిట్ దారులకు ప్రస్తుతం అగ్రీగోల్డ్ రూ. 6 వేల కోట్ల వరకూ చెల్లించాల్సివుంది. సంస్థ ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 3 వేల కోట్లు కాగా, మార్కెట్ లెక్కల్లో అది రూ. 10 వేల కోట్ల వరకూ ఉంటుందన్నది అధికారుల అంచనా. దీంతో అగ్రీగోల్డ్ బాధితుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఏళ్ల తరబడి తమకు న్యాయం కోసం నిరసనలు తెలుపుతున్న వారు, ఇప్పుడైనా తాము పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles