ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదు.. కత్తి మాటలపై రియాక్ట్ ఎలా అయ్యాడంటే.. | I am not pressure on Govt in any cost Pawan kalyan

Pawan kalyan new press meet

Pawan Kalyan, Pawan Press Meet, Pawan kalyan Political Carrier, Pawan Katti Mahesh, Pawan Kalyan Press Meet, Janasena Chief Pawan Kalyan

Janasena Chief Pawan Kalyan New Press Meet. He Never Pressure on Government. Pawan No Response on Katti Mahesh Comments.

ITEMVIDEOS:ప్రభుత్వంపై ఏనాడూ ఒత్తిడి తేలేదు: పవన్ కళ్యాణ్

Posted: 09/02/2017 06:44 AM IST
Pawan kalyan new press meet

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఇవ్వలేమని స్పష్టంగా చెప్పాలని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. చెయ్యాలనుకున్నది చెప్పడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదాపై విస్పష్ట ప్రకటన చేసేందుకు రాజకీయ పార్టీలకు ఉన్న అభ్యంతరం ఏంటని ఆయన నిలదీశారు. ప్రత్యేకహోదాపై ఉద్యమాన్ని ఎప్పుడూ ఆపలేదని ఆయన తెలిపారు. కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ కోసం సెమినార్ నిర్వహించాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు. తాను చెప్పిన పనులు చేయాలని ప్రభుత్వంపై ఎన్నడూ ఒత్తిడి చేయలేదని ఆయన తెలిపారు.

తనను పిలిస్తే ఎక్కడికైనా వెళ్తానని ఆయన చెప్పారు. తాను పేదల కోసం పని చేస్తున్నానని ఆయన చెప్పారు. తనకు ఏ పార్టీ పట్ల ప్రత్యేక అభిమానం లేదని ఆయన అన్నారు. జనసేన నిర్మాణం ఇంకా జరుగుతోందని ఆయన అన్నారు. 25 ఏళ్ల పాటు సమాజం కోసం, పార్టీ తరపున కష్టపడేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాదులో పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ, తన లక్ష్యం కేవలం ఎన్నికల్లో సీట్లు గెలవడం మాత్రమే కాదని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ విఫలమైన నేపథ్యంలో ప్రతి విషయంలో నిరూపించుకోవాల్సిన పరిస్థితి తనపైన ఉందని ఆయన చెప్పారు. 2018 చివరి నాటికి తన బలాబలాలపై ఒక అంచనా వస్తుందని ఆయన అన్నారు.

 

 

ఇక్కడ కూర్చుని బలాబలాలను చెప్పడం సహేతుకం కాదని ఆయన అన్నారు. తాను ఊహల్లో ఉండనని, వాస్తవంగా ఆలోచిస్తానని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు.విజయం సాధించని పక్షంలో పోటీ చేసి ఉపయోగం ఉంటుందా? అని ఆయన అడిగారు. అధికారం వస్తుందా? అసెంబ్లీకి వెళ్తామా? అన్నది ప్రశ్న కాదని, పని చేసుకుంటూ పోతే వచ్చేవి ఎలాగూ వస్తాయని ఆయన చెప్పారు. తాను ఒక ప్రాంతం, ఒక భాషకు పరిమితం కాదని ఆయన అన్నారు. సోషల్ మీడియా ద్వారా పార్టీని విస్తరించాలని ఆయన అన్నారు. శతఘ్ని పేరుతో డిజిటల్ టీమ్ ను ఆయన తయారు చేస్తున్నారు.

తాను తెలంగాణలోనే పెరిగానని ఆయన చెప్పారు. తెలంగాణలోని జిల్లాల్లో యువత సమస్యపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తనకు అనిపించలేదని, ఇంకా నేతల వెనుక, వారికి సపోర్టుగా ఉన్నట్టు అనిపిస్తోందని, వారిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అయితే కత్తి మహేష్ వివాదంపై పట్టించుకోకపోవటమే అన్న రీతిలో ఆయన మాట్లాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena Party  Press Meet  

Other Articles