Polling underway for MCK elections మున్సిపల్ ఎన్నికలలోనూ టీడీపీ కోడ్ ఉల్లంఘన

Polling underway for kakinada municipal corporation elections

Kakinada Municipal Corporation elections, NOTA button, NOTA option, TDP Mla violates election code, Pithapuram mla Varma, BJP candidate campaign in polling booth, TDP candidate campaign in polling booth, etimogga, 14th ward, 35 hypersenstative polling stations, Kakinada, Municipal Corporation, elections, TDP, YSRCP, Congress, BJP, CPI, CPM

Nearly 2.80 lakh voters of Kakinada Municipal Corporation are expected to cast their votes in the elections and the voting will take place in 192 polling stations out of which 35 are hyper-sensitive polling stations.

మందకొడిగా సాగుతున్న కాకినాడ పోలింగ్

Posted: 08/29/2017 10:35 AM IST
Polling underway for kakinada municipal corporation elections

కాకినాడ నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికలలో ఓటింగ్ మందకొడిగా సాగుతుంది. స్థానిక ఎన్నికలకు ఓటర్లు పెద్ద సంఖ్యలో అసక్తి కనబర్చేందుకు బదులు.. అంతగా ఉత్సాహం కనబర్చకపోవడంతో పోలింగ్ శాతం తక్కువగానే నమోదవుతుందన్న అందోళన అన్ని పార్టీల అభ్యర్థులలో వ్యక్తంమవుతుంది. దీంతో ఓటింగ్ ప్రారంభమైన రెండున్నర గంటల వరకు కేవలం 15 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగనుంది.

ఇదిలావుండగా నంద్యాల అసెంబ్లీ సీటు తరహాలో ఏమి చేసైనా.. కాకినాడ నగరపాలక సంస్థపై తమ జెండాను ఎగురవేయాలని పట్టుదలతో వున్న కేంద్రరాష్ట్రాలలోని అధికార పక్షం.. నిస్సిగ్గుగా అధికార దుర్వినియోగానికి పాల్పడతుందని ప్రతిపక్ష సభ్యులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ఫిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్దే స్లిప్పులు పంపిణీ చేయడాన్ని పోలీసులు అడ్గుకోగా, వారితో ఎమ్మెల్యే వర్మ వాగ్వాదానికి దిగారు.

ఏకంగా పోలింగ్ బూత్ లోనికి వెళ్లి ఓటు వేయడానికి వచ్చని ఓటర్లును ప్రలోభాలకు గురిచేసి మరీ తమకు అనుకూలంగా ఓటువేయించుకన్నారని, ఇక మరికోందరిని భయాందోళనకు గురిచేసి మరీ ఓట్లు వేయించుకున్నారని వైసీపీ నేతలు అరోపిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా ఎమ్మెల్యే వర్మ చర్యలను చూస్తూ నిశ్చేష్టులై నిల్చుండిపోయారని ప్రతిపక్ష నేతలు పేర్కోన్నారు. అధికారం మాటున టీడీపీకి చెందిన అభ్యర్థులతో పాటు బీజేపి అభ్యర్థులు కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారన్న అరోపించారు.

14వ వార్డు ఏటిమొగ్గలో డివిజన్ టీడీపీ అభ్యర్థి వనమాడి ఉమాశంకర్ పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తుండగా, వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు 4వ డివిజన్‌ పరిధిలో బీజేపీ అభ్యర్థి తోట నాగలక్ష్మి ఎన్నికల కోడ్‌ నిబంధనలకు విరుద్ధంగా ప్రచారానికి దిగారు. పోలింగ్‌ బూత్‌ నం.4/2లో ఆమె ప్రచారం చేస్తున్నా పోలీసులు ఏమాత్రం అమెను ప్రచారాన్ని చూసి కూడా పట్టించుకోలేదని, అయితే అప్పుడే మీడియా ఎంటర్ కావడంతో అమెను పోలీసులు అక్కడి నుంచి పంపించారని వైసీసీ నేతలు అరోపించారు.

ఇక 19వ వార్డు నుంచి పోటీచేస్తున్న బీజేపి అభ్యర్థి పోలింగ్ బూత్ లోనే ఓటర్లకు డబ్బులు పంఫిణీ చేస్తున్నారన్న వార్తలతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ అరోపణల నేపథ్యంలో బీజేపి అభ్యర్థిని నిలవరించేందుకు వైసీసీ పార్టీ శ్రేుణులు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. తాము పిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో వరిన పోలీసులు చెదరగొట్టారు. ఇక నగరపాలక సంస్థ ఎన్నికలలో నోటా బటన్ వుండదని, అది కేవలం పార్లమెంటు, శాసనసభ ఎన్నికలు మాత్రమే వుంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kakinada  Municipal Corporation  elections  TDP  YSRCP  Congress  BJP  CPI  CPM  

Other Articles