India, China complete troop disengagement వెనక్కు తగ్గిన చైనా.. ప్రధానికి ప్రతిపక్ష నేతల అభినందనలు

Sushma swaraj briefs manmohan singh sonia gandhi on easing of dokalam standoff

PM Modi, sushma swaraj, sonia gandhi, manmohan singh, India, China, doklam, standoff, People's Liberation Army, troops, sovereignty, Jinping, BRICS Summit

The Congress, for its part, welcomed and supported the understanding between India and China to de-escalate the border tension at Dokalam in the Sikkim sector.

వెనక్కు తగ్గిన చైనా.. ప్రధానికి ప్రతిపక్ష నేతల అభినందనలు

Posted: 08/29/2017 09:04 AM IST
Sushma swaraj briefs manmohan singh sonia gandhi on easing of dokalam standoff

గత కొన్ని నెలలుగా సాగుతున్న డోక్లామ్‌ వివాదానికి తెరపడిందనుకున్న సమయంలో చైనా మరోసారి తన వక్రబుద్ధి చాటుకుంది. భారత్‌- చైనాల మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చల్లో భాగంగా రెండు దేశాల తమ బలగాలను డోక్లామ్‌ నుంచి ఉపహరించుకోవడానికి అంగీకరించిన డ్రాగన్ దేశం.. తన వక్రబుద్దిని ప్రదర్శించి.. డోక్లాంలో తమ గస్తీ మాత్రం కోనసాగుతుందని, కేవలం భారత మాత్రమే సైనికులను ఉపసంహరించుకుంటారని ప్రకటించింది.

ఇలా ప్రకటన చేసిన మరికోద్ది గంటల వ్యవధిలోనే డోక్లాం నుంచి పూర్తిగా తమ సైనికులను వెనక్కు రప్పించుకుంది. ఈ క్రమంలో డోక్లాం నుంచి చైనా బుల్‌ డోజర్లు వెనక్కి వెళ్లిపోయాయని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డోక్లాంలో వివాదానికి కారణమైన రహదారి నిర్మాణం ఆగిపోయిందని భారత్ చెబుతోంది. బుల్ డోజర్లు, నిర్మాణ పరికరాలు వెనక్కి వెళ్లిపోయాయని భారత్ తెలిపింది. ఇన్నాళు భారత్ పై తమదే పై చేయి అని తన మీడియాలో చాటింపు వేయించుకున్న డ్రాగన్.. చివరకు సయోద్యకు తలొగ్గింది.

భారత్ పై తమ మీడియాలో విష ప్రచారం చేయించుకున్న డ్రాగన్.. ఎన్నో రకాలుగా భారతీయుల సంయమనాన్ని, సహనాన్ని పరీక్షించేందుకు అనేక యత్నాలు చేసినా.. అవి ఫలించకుండా.. భారత్ కూడా సమర్థవంతంగా అడుగులు వేసింది. కాగా చైనా తోకముడుచుకుని వెనక్కి వెళ్లడం భారత్ విజయమేనంటూ నెట్ జనలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చతురతను ప్రతిపక్ష నేతలు కూడా కోనియాడుతున్నారు. సరిహద్దు వివాదానికి ముగింపు పలకాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తెలిపారు. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ కు సోనియా, మన్మోహన్‌ అభినందనలు తెలిపారు.

దీనిపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తన ట్విట్టర్ ద్వారా ‘దుందుడుకు చర్యలకు పాల్పడకుండానే చైనాపై భారత్‌ పైచేయి సాధించింది. ప్రధాని మోదీకి, ఆయన బృందానికి అభినందనలు’ అని తెలిపారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా కేంద్ర ప్రభుత్వం డోక్లాం వివాదంలో చూపిన చతురతను అభినందించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తన ట్విట్టర్ ద్వారా ‘డోక్లాం వివాదం సద్దుమణగడాన్ని స్వాగతిస్తున్నాం. పొరుగుదేశాలతో సఖ్యత పెంపెందించుకోవడంపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టాలి’ అని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  sushma swaraj  sonia gandhi  manmohan singh  India  China  doklam  standoff  

Other Articles