Ten Years Imprisonment to ram rahim singh అత్యాచార అద్యాత్మిక గురువు పదేళ్ల కఠిన కారాగారం

Gurmeet ram rahim singh sentenced to ten years imprisonment

gurmeet ram rahim singh sentencing, gurmeet singh, ram rahim singh, gurmeet singh sentencing, dera sacha sauda, sunarial jail dera sacha sauda, haryana, punjab, panchkula, gurmeet ram rahim, panchkula photos, haryana violence photos, khattar, bjp, sirsa, latest news

A special CBI court sentenced Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh to ten years in prison.

ITEMVIDEOS: ‘అత్యాచార’ బాబాకు పదేళ్ల కఠిన కారాగారం

Posted: 08/28/2017 03:44 PM IST
Gurmeet ram rahim singh sentenced to ten years imprisonment

తన శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన అధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. శిక్షను ఇవాళ ఖరారు చేసేందుకు ముందు సీబిఐ న్యాయవాదితో పాటు ప్రతివాది వాదనలను కూడా విన్న న్యాయస్థానం గుర్మీత్ సింగ్ కు పదేళ్ల శిక్ష ను విధించింది. న్యాయస్థానంలో న్యాయమూర్తి శిక్షను ఖరారు చేస్తున్న క్రమంలో కన్నీళ్ల పర్యంతమైన గుర్మీత్ తనను క్షమించాలని, తన పట్ల కరుణ చూపాలని న్యాయస్థానంలోనే కన్నీళ్ల పర్యంతమైయ్యారు.

న్యాయస్థానం తీర్పును వెలువరించిన తరువాత కూడా న్యాయస్థానాన్ని వదలి వెళ్లేందుకు డేరా ఛీప్ సిద్దపడలేదు. ఆయన కోర్టులోనే చిన్నపిల్లాడిలా కుప్పకూలిపోయారు. కాగా జైలు అధికారులు గుర్మీత్ సింగ్ కు ఎలాంటి రాచమర్యాదలు చేయకుండా సర్వసాధరణ ఖైదీగానే పరిగణించాలని కూడా న్యాయమూర్తి అదేశాలు జారీ చేశారు. ఇటీవల ఆయనపై అభియోగాలు నిరూపితమై.. న్యాయస్థానం దోషిగా పరిగణించిన నేపథ్యంలో జైలుకు చేరుకున్న ఆయనకు రాచమర్యాదలు చేసినట్లు.. వార్తలు వచ్చిన క్రమంలో న్యాయమూర్తి ఈ మేరకు అదేశాలను జారీ చేశారు.

గుర్మిత్ సింగ్ శిక్షను ఖారారు చేయనున్న నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢి్ల్లీ సహా రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటును చేశాయి. మరీముఖ్యంగా పంచకులలో 144 సెక్షన్ విధించారు. దీనికి తోడు రోహ్ తక్ జైలు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే కాల్చివేత అదేశాలు అమలువున్నాయి. కాగా, అయన దోషిగా తేల్చిన క్రమంలో హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో రేగిన హింసాత్మక ఘటనలు ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమేనని కూడా నిరూపితమయ్యాయి. దీంతో రోహ్ తక్ జైలులోనే ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయగా, న్యాయమూర్తి జైలు నుంచే తీర్పును వెలువరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gurmeet ram rahim singh  sentencing  sunarial jail dera sacha sauda  haryana  punjab  panchkula  

Other Articles