voter gives his verdict in favour of ruling parties అధికారపక్షాలకే ఓటరు మొగ్గు.. నాలుగు స్థానాల్లోనూ అదే తీర్పు..

Voter gives his verdict in favour of ruling parties

bye elections, bye polls, by poll results, nandyal, panaji, valpoi, bawana, assembly segments, ved prakash, AAP, vishwajeet rane, manohar parrikar, bramhananda reddy, Andhra pradesh, Goa, Delhi, politics, ruling parties, voter mandate, voter verdict, Bawana bypoll, Congress, BJP, AAP, Bawana election result, Bawana byelection result 2017, Delhi news, Bawana bypoll result 2017, BJP loses election, AAP wins poll

Counting of votes in three assembly bypolls is almost in the last stages. but the voter had given his verdict in favour of ruling parties. In delhi bawana his verdict is in favour of AAP, and in Goa panaji and Valpoi in favour of BJP and in AP its in favour of TDP

అధికారపక్షాలకే ఓటరు మొగ్గు.. నాలుగు స్థానాల్లోనూ అదే తీర్పు..

Posted: 08/28/2017 02:27 PM IST
Voter gives his verdict in favour of ruling parties

దేశవ్యాప్తంగా నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో ఓటరు తీర్పు ఒకే విధంగా ప్రస్పూటించింది. ఢిల్లీ సహా గోవా, ఆంద్రప్రదేశ్ లలో ఓటరు తీర్పు.. అధికార పక్షానికే పట్టం కట్టింది. అభివృద్ది కోసమే దేశవ్యాప్తంగా వున్న ఓటరు ఏదురుచూసినట్లు కనినిపించింది. నవ్యాంధ్ర కర్నూలు జిల్లా నంద్యాలలో మాత్రం అటు అభివృద్దితో పాటుగా ఇటు అధికార పక్షానికి చెందిన నేత భూమా నాగిరెడ్డి అకస్మిక మరణంతో వెల్లివిరిసన సానుభూతి పవనాలు కూడా పనిచేశాయి. దీంతో అధికార పక్షానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డి తన ప్రత్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై 27 వేల ఓట్ల భారీ అధిక్యంతో విజయాన్ని అందుకున్నారు.

అటు దేశ రాజధాని ఢిల్లీలోని అప్ ఎమ్మెల్యే వేద్ ప్రకాష్ అధికార పక్షాన్ని వీడి.. బీజేపి పార్టీలోకి చేరడంతో వచ్చిన ఉప ఎన్నికలలో వేద్ ప్రకాష్ కు ఎన్నికలలో చుక్కెదురైంది. అధికార అప్ పార్టీకి అనుకూలంగా ఓటరు తీర్పునిచ్చాడు. తన సమీప బీజేపి అభ్యర్థి వేద్ ప్రకాష్ పై అధికార పార్టీకి చెందిన అభ్యర్థి రాంచంద్ర  సుమారు 24 వేల ఓట్ల అధిక్యంతో గెలుపోందారు. అయితే రెండో స్థానం కోసం బీజేపి, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లు సాగినా.. చివరకు బీజేపి 35,834 ఓట్లతో రెండో స్థానంలో నిలువగా, 31,919 ఓట్లతో కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. కాగా తొలి రౌండులో మాత్రం కాంగ్రెస్ అబ్యర్థి సురేంద్ర కుమార్ 2000 ఓట్ల పైచిలుకు మోజారిటీలో వుండగా, రానురాను అవి అవిరయ్యాయి.

ఇటు గోవాలో మైనారిటీలోని బీజేపి ప్రభుత్వానికి ఉప ఎన్నికలు మరింత బలానిచ్చాయి. గోవాలో పనాజీ, వాల్పోయి స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనూ ఓటరు మహాశయుడు అధికార ప్రభుత్వానికే మద్దతుగా నిలిచాడు. పనాజీ స్థానం నుంచి ఉప ఎన్నికల బరిలో నిలిచిన కేంద్రమాజీ మంత్రి మనోహర్ పారికర్.. కాంగ్రెస్ కు చెందిన గిరీష్ రాయ చదంక్కర్ పై 4వేల ఓట్లపైచిలుకు మోజార్టీతో విజయం సాధించారు. కాగా, కాంగ్రెస్ నుంచి బీజేపిలో చేరిన విశ్వజీత్ రాణే కూడా కాంగ్రెస్ అభ్యర్థి ,సమీప ప్రత్యర్థి రవినాయక్ పై 10వేల 66 ఓట్ల మోజారిటీతో విజయాన్ని అందుకున్నారు. మొత్తంగా ఓటరు తీర్పు ఈ నాలుగు స్థానాల్లో అధికార పక్షానికి అనుకూలంగానే వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra pradesh  Goa  Delhi  ruling parties  voter verdict  politics  

Other Articles