Nandyal by-polls tomorrow, stakes high for TDP, YSRCP నంద్యాల ఉప ఎన్నికకు ఏర్పాటు పూర్తి..

Nandyal by polls tomorrow stakes high for tdp ysrcp

nandyal by polls shedule, nandyal by polls notification, nandyal by polls date, nandyal by polls counting, nandyal, assembly, by-polls, by-elections, election comission, TDP, YSRCP, bhuma nagi reddy, election news

When 2.19 lakh voters of Nandyal Assembly constituency in Kurnool district of Andhra Pradesh exercise their franchise in the by-election tomorrow, they will be virtually setting the trend for the general elections due in May 2019.

నంద్యాల ఉప ఎన్నికకు ఏర్పాటు పూర్తి..

Posted: 08/22/2017 07:56 PM IST
Nandyal by polls tomorrow stakes high for tdp ysrcp

సీనియర్ రాజకీయ నేత భూమా నాగిరెడ్డి గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించడంతో.. కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన ఉపఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని కేంద్రాలకు పోలింగ్‌ సామాగ్రి తరలించిన అధికారులు.. ఎన్నికల సిబ్బందికి తగు విషయాలలో మరోమారు తర్పీదును కూడా ఇచ్చారు. గతంలో లేనట్టుగా ఈ సారి ఎన్నికల కేంద్రంలో జరిగే ప్రతీ కదిలికను ఎన్నికల సంఘం అధికారులు కెమెరా లింక్ తో పరిశీలించనున్నారు.

నియోజకవర్గ పరిధిలోని మొత్తం 255 పోలింగ్ బూత్ లకు దాదాపు 6వేల మంది  పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాలు పంచుకుంటున్నారు. బుధవారం ఉదయం 7 గంటలను నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కాగా నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్ లు సమస్యాత్మకమైనేనని నిర్థారించుకున్న ఎన్నికల సంఘం రమారమి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.

నియోజకవర్గంలోని 144 పోలింగ్‌ కేంద్రాలను అత్యంత సమస్మాత్మకంగా, 71 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి వాటిలో ప్రశాంతంగా ఓటింగ్ జరిగేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని పారామిలటరీ బలగాలకు అప్పగించనున్నారు. దీనికి తోడు పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలను కూడా అమర్చి ఎప్పటికప్పుడు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల పరిస్థితిని పర్యవేక్షించనుంది. ఇందుకోసం ఇప్పటికే 6 కంపెనీల కేంద్ర పోలీస్‌ బలగాలు నంద్యాలకు చేరుకున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ వెబ్ క్యాస్టింగ్‌ సిబ్బంది సహా మొత్తం 10 మంది విధులు నిర్వహించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nandyal  assembly  by-polls  election comission  TDP  YSRCP  bhuma nagi reddy  election news  

Other Articles