జియోకు గట్టి కౌంటర్.. అంతకంటే బెటర్ ఫీచర్స్ తో 4జీ ఫోన్ | Airtel to Launch Better 4G Phone Smart Phone

Airtel plans to launch bundled 4g smartphone

Jio 4G Smartphone, Airtel 4G Smartphone, Airtel Counter Jio Phone

Airtel plans to launch bundled 4G smartphone at Rs 2,500 before Diwali, To counter Jio.

జియోకు పోటీగా మరో 4జీ ఫోన్

Posted: 08/22/2017 09:07 AM IST
Airtel plans to launch bundled 4g smartphone

రిలయన్స్ జియోకు పోటీ ఇచ్చేందుకు మరో మొబైల్ దిగ్గజం ఎయిర్ టెల్ ఇండియా సిద్ధమైపోతుంది. ఉచిత ఫీచర్ ఫోన్ కు పోటీగా తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్ అందించేందుకు ప్రణాళిక రచించింది. రూ. 2,500 ధరలో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఎయిర్ టెల్ అందుబాటులోకి తేనుంది. పలు మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలతో ఎయిర్ టెల్ జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్టు సమాచారం.

అధికమొత్తంలో డేటాతో పాటు వాయిస్ మినిట్స్ ఇస్తూ, ఈ ఫోన్ ను ఫీచర్ ఫోన్ తో పోలిస్తే మెరుగైన ఆప్షన్లతో తీసుకువస్తున్నట్టు ఎయిర్ టెల్ వర్గాలు వెల్లడించాయి. జియో ఫీచర్ ఫోన్ తో పోలిస్తే మెరుగైన స్క్రీన్, మంచి కెమెరా, అధిక బ్యాటరీ సామర్థ్యం దీనికి ఉంటాయని టెలికం ఇండస్ట్రీ నిపుణులు వ్యాఖ్యానించారు.

కాగా, ఎయిర్ టెల్ తమతో చర్చలు జరిపిన మాట వాస్తవమేనని లావా, కార్బన్ సంస్థలు ప్రకటించాయి. అయితే, డీల్ కుదిరిందా? లేదా? అన్న విషయాన్ని మాత్రం ఈ కంపెనీలు వెల్లడించలేదు. ఇక తమ కొత్త స్మార్ట్ ఫోన్ విషయమై ఎయిర్ టెల్ అధికారికంగా స్పందించాల్సి వుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు అన్ని రకాల యాప్స్ నూ వాడుకోదగ్గ ఈ ఫోన్ దసరా, దీపావళి పండగ సీజన్ లో మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jio  4G Smartphone  Airtel  

Other Articles