పాత బస్తీలో కార్డన సెర్చ్.. ఒకదాని కోసం వెళ్లితే.. మరోకటి బయటపడింది | Old City Cordon Reveals Shocking Facts

Police conducts cordon search at old city

Cordon Search, Cordon Search Old City, Cordon Search Old Criminals, Cordon Search Shocking, Cordon Search Arrests, Hyderabad Police Cordon Search , Cordon Search Arrests, Cordon Search People Oppose, Cordon Search Hyderabad

Police Conducts Cordon Search At Old City. Old criminals were arrested. And also Adulteration Goods seized.

ITEMVIDEOS:ఓల్ట్ సిటీని రౌండప్ చేసిన పోలీసులు

Posted: 08/05/2017 10:30 AM IST
Police conducts cordon search at old city

పాతబస్తీ మరోసారి బూట్ల చప్పుడు తో వణికిపోయింది. శివారు ప్రాంతాలైన అసద్ బాబానగర్, కిషన్ బాగ్ ప్రాంతాల్లో శనివారం ఉదయం కార్డన్ సెర్చ్ చేపట్టారు. పాత నేరస్థులు తలదాచుకున్నారన్న సమాచారంతో దక్షిణ మండలం పోలీసులు ఈ సోదాలు చేపట్టగా, ఏం జరుగుతుందో ప్రజలు కంగారుపడిపోయారు.

సుమారు 300 మంది పోలీసులు తెల్లవారు జాము 5 గంటలకు ఓల్డ్ సిటీని చుట్టుముట్టారు. మూడు గంటలపాటు ఉదయం 8 గంటల వరకు ఇవి కొనసాగాయి. మొత్తం 84 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 56 చోరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు తనిఖీల సమయంలో కొందరి ఇళ్లల్లో యాసిడ్‌, కుళ్లిన బంగాళాదుంపలతో తయారుచేసిన కల్తీ అల్లం, వెల్లల్లి పేస్టు డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.

 

మరోపక్క ప్రమాదకర రసాయనాలతో తయారుచేస్తున్న కల్తీ మెహందీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 84 మందిలో 20 మంది రౌడీ షీటర్లు, 23 మంది పాత నేరస్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి కత్తులు, తుపాకులను(?) కూడా సేకరించినట్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Cordon Search  Arrests  

Other Articles