Vikram Goud's Gun Fire Links with Drug Case

Vikram goud firing case twists

Vikram Goud, Vikram Goud Fire Case, Vikram Goud Phone, Vikram Goud Drug Case, Vikram Goud Pub Drug, Vikram Goud Debts, Vikram Goud Suicide Attempt, Vikram Goud Wife Shefali Fire Case, Vikram and Shefali Clashes, Mukesh Goud Son Suicide Attempt, Vikram and Shefali, Mukesh Goud Son Drug Case, Vikram Goud Firing Mystery

Telangana Congress Youth Leader Vikram Goud Shot in Hyderabad. Suspect that have links with Drug Case and Committed suicide attempt. Vikram Phone Contains SIT probe details.

డ్రగ్స్ కేసుతో లింకు.. సూసైడ్ అటెంప్ట్??

Posted: 07/28/2017 03:42 PM IST
Vikram goud firing case twists

భాగ్యనగరంలో కలకలం రేపిన డ్రగ్స్ కేసుకు, ఈ ఉదయం కాంగ్రెస్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై జరిగిన కాల్పులకు లింకు ఉందా?. పోలీసు విచారణలో కేసు మిస్టరీ మెల్లిగా వీడుతోంది. విక్రమ్ ఫోన్ వాట్సాప్ లో కీలక సమాచారం లభ్యం కావటంతో ఆత్మహత్యా యత్నం చేశాడా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

విక్రమ్ గౌడ్ ఫోన్ లో గత పదిరోజులుగా డ్రగ్స్ దందాపై సిట్ చేస్తున్న విచారణ వివరాలను నిక్షిప్తం చేసుకున్నాడు. అలాగే గత 15 రోజుల్లో విక్రమ్ గౌడ్ కు 39 వాట్స్ యాప్ మెసేజ్ లు వచ్చాయి. ఈ మెసేజులన్నింటిలో 15 లక్షలివ్వాలి, ఫలానా అప్పుడు 20 లక్షలిచ్చాను తిరిగి ఇవ్వు అని, నీకు 30 లక్షలిచ్చాను కదా అవిప్పుడే కావాలి అని, నీకిచ్చిన 35 లక్షలు ఇప్పుడిచ్చెయ్ చాలా అవసరం అంటూ భారీ ఎత్తున డబ్బులకు సంబంధించిన డిమాండ్లు ఉన్నాయి. ఇప్పటికే తండ్రి ముకేష్ ఇచ్చిన ఇల్లును విక్రయించినట్లు భోగట్టా. అప్పుల వాళ్ల ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంతో పాటు మాదాపూర్ లోని పబ్ కలిగి ఉన్న విక్రమ్ గౌడ్ కు డ్రగ్స్ తలనొప్పులు కూడా ఉన్నాయి. 

అసలేం జరిగింది?

ఈ నేపథ్యంలో సిట్ విచారణ, అప్పుల బాధ తొలగించుకోవాలంటే తన ముందు ఉన్న ఏకైక మార్గం ఆత్మహత్యాయత్నమే అని ఆయన భావించి ఈ పని చేసుంటాడని భావిస్తున్నారు. ఈ ఉదయం తెల్లవారు జామున 3:10 నిమిషాలకు తుపాకీతో ఓ ఆగంతుకుడు విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిపాడంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. కాల్పులు జరిపింది ఎవరో తనకు తెలుసని, కోలుకున్నాక చెబుతానని విక్రమ్ నాన్చటం, భార్య షిఫాలీ కూడా చెప్పే సమాధానాలు కూడా పొంతన లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikram Goud  Firing Case  Drug Mafia  

Other Articles