Chalo Amaravati Padayatra Last Fight for kapu Reservation

Mudragada on govt restrictions to chalo amaravati padayatra

Mudragada Padmanabham, Mudragada Chalo Amaravati Padayatra, Mudragada Warn Government, Mudragada on Restrictions, Mudragada Press Meet, Mudragada July 26, Mudragada Last Battle, Mudragada kapu Agitation, Kapu Agitation, Kapu Reservations, Mudragada Jail

Mudragada Padmanabham fire on AP Government over restrictions to his Chalo Amaravati Padayatra. This is last battle and not fear even put in jail.

కాపు ఉద్యమం.. ఇదే ఆఖరి పోరాటమా?

Posted: 07/12/2017 10:43 AM IST
Mudragada on govt restrictions to chalo amaravati padayatra

కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం మరోసారి మీడియా ముందకు వచ్చారు. కాపుల రిజర్వేషన్ కోసం డిమాండ్ చేస్తూ ఈ నెల (జూలై) 26 నుంచి పాదయాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన మరోమారు మండిపడ్డారు. ఇదే ఆఖరి పోరాటమని, ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ప్రకటించాడు.

కాపులను అణగదొక్కి, ఇతర కులాల్లో భయం సృష్టించాలని చూస్తున్నారని, ఎంతగా అణచివేస్తే, అంత తీవ్రతరం చేస్తామని హెచ్చరించాడు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తానంటే, పోలీసులను మోహరిస్తారా? అంటూ ప్రశ్నించాడు. ఇచ్చిన హమీలు నెరవేర్చమంటే ఉక్కుపాదం మోపుతారా? రిజర్వేషన్ల కోసం మీటింగ్ పెడితే నేరమా. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులుంటాయని ఆయన పేర్కొన్నాడు.

కాపు రిజర్వేషన్లపై ఎన్నికల్లో ఇచ్చిన హమీని గుర్తు చేస్తే చంద్రబాబుకు చీమకుట్టినట్టయినా లేదంటూ మండిపడ్డాడు. తమపై పెడుతున్న కేసుల్నే రిజర్వేషన్లుగా భావించమంటారా? అంటూ సెటైర్ వేశాడు. ఎన్ని అడ్డంకులు కల్పించినా, చివరకు జైల్లో పెట్టినా ఉద్యమం ఆగదని స్పష్టం చేశాడు. జీవో నెంబ 30, సెక్షన్ 30 అమలు చేస్తామంటూ ప్రభుత్వం బెదిరిస్తుందని, అలాగైతే గతంలో ఉద్యమంలో పాల్గొన్న 15 లక్షల మంది కాపులు ముద్దాయిలే అని చెప్పుకొచ్చాడు. పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా అనే ప్రశ్నను ఇకపై తనను అడగవద్దని... ఈ ప్రశ్నను ప్రభుత్వాన్నే అడగాలని మీడియాకు ముద్రగడ సూచించారు.  

బీసీ రిజర్వేషన్‌ హామీని అమలు చేయాలని కోరుతూ పలు దఫాలుగా ఉద్యమాలు నిర్వహించిన ముద్రగడ ఈసారి ‘చలో అమరావతి’పిలుపుతో నిరవధిక పాదయాత్రకు సంకల్పించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada Padmanabham  Kapu Agitation  Chalo Amaravati Padayatra  

Other Articles