Congress Ex MP ready for hunger strike against KCR

Ex mp dares kcr to inspect karimnagar town

TPCC Vice President, Ponnam KCR, KCR karimnagar Visit, Ponnam VS KCR, KCR Dare Karimnagar Development, Ponnam Prabhakar Hunger Strike, Telangana Congress Challenge KCR, KCR Karimnagar Visit

TPCC vice president and former member of Parliament Ponnam Prabhakar Challenges KCR. CM to inspect Karimnagar town to show the development in his tenure.

కేసీఆర్ సవతి ప్రేమ.. ఆమరణ దీక్ష!

Posted: 07/12/2017 08:57 AM IST
Ex mp dares kcr to inspect karimnagar town

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై దాడిని ముమ్మరం చేసేందుకు విపక్షాలు సిద్ధమైపోతున్నాయి. టీడీపీ బలం తక్కువగా ఉండటంతో తమ గొంతుకనే వినిపించి ప్రజల్లో సానుభూతి
కొట్టేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ రంగంలోకి దిగిపోయింది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుని, అభివృద్ధిపై కేసీఆర్ అండ్ కో ను ఎండగట్టాలని ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు మ్యానిఫెస్టోలోని అంశాల అమలుపైనా నిరసనలు చేపట్టేందుకు రెడీ అయిపోయింది.

ఈ క్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆమరణ దీక్షకు సిద్ధమైపోతున్నాడు. కరీంనగర్ ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటంతో వచ్చేనెల 5 నుంచి తాను దీక్ష చేపడతానని ప్రకటించాడు. మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ క‌రీంన‌గ‌ర్‌ జిల్లాకు వ‌చ్చి మెడికల్‌ కళాశాల మంజూరు చేస్తానని మాట ఇచ్చాడని, కానీ, ఇప్ప‌టివ‌ర‌కు అది నెర‌వేర్చ‌లేద‌ని పొన్నం మండిప‌డ్డాడు. కనీసం కళాశాలకు ఎన్‌వోసీ కూడా తెప్పించలేని పరిస్థితిలో ఆయన ఉన్నారా? అంటూ ప్రశ్నించాడు.

కరీంనగర్‌ జిల్లాపై సవతితల్లి ప్రేమ చూపిస్తోన్న కేసీఆర్ మ‌రోవైపు సిద్దిపేట ప‌ట్ల మాత్రం ఎన‌లేని ప్రేమ‌ కురిపిస్తున్నాడంటూ ఫైర్ అయ్యాడు. ఎంపీగా ఉన్న సమయంలోనూ అసలు ఆయన(కేసీఆర్) ఏం అభివృద్ధి చేశారో చూపాలని పొన్నం డిమాండ్ చేశాడు. అయితే ఇన్నాళ్లూ జూనియర్ లు, సీనియర్లు అంటూ విమర్శలు చేసుకుంటూ ఎవరికి వారే అన్న చందాన వ్యవహరించిన టీ కాంగ్ నేతలు ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి కేసీఆర్ సర్కార్ పై దాడికి సిద్ధమవ్వటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Ponnam Prabhakar  Congress  KCR  Karimnagar Visit  

Other Articles