Rs 200 Currency Notes Available at Banks Only

200 currency notes not to be circulated through atms

RBI, RBI News, RBI 200 Note, New 200 Note, Rs 200 Note ATMs, Rs 200 Not ATMs, Rs 200 Bank Branches Only, Rs 200 Banks, Rs 200 No ATMs, Rs 200 RBI News, Rs 200 Demonetization, Rs 200 India, India New Currency, 200 Notes Shocks, Fake 200 Notes, 200 Notes Trouble

The RBI has proposed to circulate the new Rs 200 banknotes only through bank branches, similar to the way Rs 50 and Rs 10 notes are circulated, reports said.

200 నోటు, ప్చ్... కష్టం బాస్

Posted: 07/06/2017 08:46 AM IST
200 currency notes not to be circulated through atms

చిల్లర కష్టాలు తీర్చేందుకు త్వరలో 200 నోటును ఆర్థిక శాఖ ప్రవేశపెట్టబోతున్న వార్త దేశ ప్రజలకు ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందుకు సంబంధించి ముద్రణ పనులను కూడా మొదలుపెట్టేసిందని ఓ అధికారి కూడా చెప్పేశాడు. అయితే ఇది సామాన్యులకు ఎంతమేర అందుబాటులోకి వస్తుందన్న దానిపై కొత్త ప్రశ్నలు మొదలవుతున్నాయి.

మిగతా నోట్లలాగా రూ.200 నోట్లను ఆర్బీఐ అన్ని చోట్లా అందుబాటులో ఉంచకూడదని భావిస్తున్నట్లు సమాచారం. కొత్త రూ.200 నోట్ల వల్ల చిన్న కరెన్సీకి సంబంధించిన డిమాండ్ సప్లై మధ్య ఉన్న అంతరం తగ్గుతుందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే వీటిని ఏటీఎంలలో కాకుండా, కేవలం బ్యాంకు బ్రాంచుల వద్దనే పంపిణీ చేయాలని ఆర్బీఐ భావిస్తోందని సమాచారం. అంటే రూ.10, రూ.20 రూ.50 నోట్ల మాదిరిగా... రాబోయే కొత్త రూ.200 నోట్లు కూడా ప్రత్యేకంగా లభ్యం కానున్నాయన్నమాట.

నోట్ల రద్దు దృష్ట్యా చిల్లర కష్టాలను తీర్చేందుకు ఈ యేడాది మొదట్లోనే కొత్త రూ.200 నోట్లు రాబోతున్నాయని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఆర్బీఐ మాత్రం ఈ విషయంలో అలసత్వం చేస్తూ వస్తోంది. ఎక్కువగా కొత్త రూ.2000 రూ.500 సప్లయ్ చేయడంతో చిన్న నోట్ల కొరత ఏర్పడింది. పెద్ద నోట్లు ఉన్నా వాటిని ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు 200 నోట్ల ముద్రణకు ముందుకు వచ్చింది. మరోపక్క కొత్త 1000 నోట్లు రాబోతున్నాయన్న వార్తను మాత్రం ఆర్బీఐ ఖండించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  RS 200 Note  Bank Branches  

Other Articles