Drunk Groom Nagin Dance Calls off Marriage

Bride calls off wedding due to nagin dance

Uttar Pradesh, Bride Calls off, Nagin Dance, Bride Groom Nagin Dance, Groom Nagin Dance, Shahjahanpur Bride, Shahjahanpur Bride Grrom, Drunk Groom Nagin Dance, Groom Calls Off Wedding

Bride calls off wedding after groom's Nagin Dance in Uttar Pradesh. Priyanka Tripathi, 23, was all set to marry Anubhav Mishra in Shahjahanpur city. Mishra was drunk and his cringe-worthy attempt at with Nagin dance.

పెళ్లి కొడుకు టాలెంట్ చూసి లేచిపోయింది

Posted: 06/30/2017 09:40 AM IST
Bride calls off wedding due to nagin dance

పెళ్లిలో బ్యాండ్ బాజా, బారాత్ లు చాలా సాధారణమైన విషయాలే. అయితే యూపీలో మాత్రం ఓ పెళ్లి కూతురుకు ఆ వ్యవహారం చిర్రెత్తుకొచ్చింది. అంతే పెళ్లి కాన్సిల్ చూసి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయింది. అఫ్ కోర్స్ అందుకు ఓ బలమైన కారణం ఉందనుకోండి. అదేంటో తర్వాత చెబుతాం.

షహజాన్‌పూర్‌కు చెందిన అనుభవ్ మిశ్రా-ప్రియాంక త్రిపాఠీ (23) లకు వివాహం నిశ్చయమైంది. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మంగళవారం రాత్రి ముహుర్తం ఫిక్సయింది. పెళ్లి కూతురు అల్రెడీ మండపంకు చేరి కూర్చుంది. ఇక మిగిలింది పెళ్లి కొడుకు రావటమే. ఎందుకో ఆలస్యం అయ్యింది. ఇంతలో ఎక్కడి నుంచో డీజే సౌండ్లు వినిపిస్తున్నాయి. ఆ సందడి మెల్లిగా పెళ్లి పందిరివైపు సాగింది. వరుడు అనుభవ్ మిశ్రా అండ్ బ్యాచ్ డాన్సులు చేస్తున్నారు. ఇంతలో నాగిని సాంగ్ ప్లే చేయగా, రెచ్చిపోయిన పెళ్లికొడుకు డాన్సుతో రచ్చ చేశాడు. పాములా పాకుతూ మధ్యమధ్యలో బుసలు కొడుతూ లయబద్ధంగా స్టెప్పులేశాడు. బంధువులు, ఫ్రెండ్స్ అతడిపై నోట్ల విసురుతూ మరింత ప్రోత్సహించారు. కానీ, పెళ్లి కూతురుకి మాత్రం ఎక్కడో కాలింది. కారణం అనుభవ్ పీకలదాకా తాగి ఉండటమే.

అంతే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తాగుడు అలవాటున్న అనుభవ్ తనకు సరిజోడు కాదని భావించింది. వెంటనే పెళ్లిని రద్దు చేసుకుని పీటల మీద నుంచి వెళ్లిపోయింది. పెళ్లి కూతురు, వరుడి తరపు బంధువులు నచ్చజెప్పినా వినలేదు. ఆమె పెరేంట్స్ కూడా ప్రియాంకకే మద్ధతు తెలిపారు. తప్పతాగి తాను చేసిన పనికి ఊహించని పరిణామం ఎదురుకావటంతో అనుభవ్ షాక్ కి గురయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Bride Groom  Nagin Dance  Calls Off  

Other Articles