Leader's Illegal Affair Scandal Viral in KTR's Constituency

Sircilla councillor scandal viral

Sircilla Councillor, Sircilla Councillor Video KTR, TRS Sircilla Councillor, TRS Leader Scandal, TRS Leader Video, TRS Leader Shocking Video, Rajanna Sircilla, TRS Leader Sex Video Viral

KTR's Constituency Sircilla Councillor Illegal Affair, Scandal Video Viral on Local Youth Mobiles. Police not yet take Any Action as No Complaint registered.

కేటీఆర్ ఇలాకాలో ఏందిది?

Posted: 06/27/2017 08:03 AM IST
Sircilla councillor scandal viral

తెలంగాణ యంగ్ డాషింగ్ అండ్ డైనమిక్ నేతగా కేటీఆర్ కు ఉన్న పేర్లు తెలిసినవే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆయన సమస్యలను సత్వరం పరిష్కరిస్తాడనే ఓ పేరు కూడా ఉంది. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఫెలయివుతూనే ఉన్నాడంటూ కామెంట్లు పడుతున్నాయి. అంతేనా తన నియోజకవర్గంలోని సమస్యలను పట్టించుకోవటం క్రమక్రమంగా తగ్గించేస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో మరో వ్యవహారం ఇప్పుడు వార్తల్లో చక్కర్లు కొడుతోంది. కేటీఆర్ నియోజక వర్గం సిరిసిల్ల కు చెందిన జరిగిన ఓ నేత(కౌన్సిలర్ అని చెబుతున్నారు) వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆయనగారి వివాహేతర సంబంధం కు సంబంధించిన వీడియో ఒకటి అక్కడి యువకుల మొబైళ్లలో చక్కర్లు కొడుతోందంట. జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లో ఓ వివాహితతో ఆయన కొంత కాలంగా అఫైర్ నడుపుతున్నాడు. దీనిని గుర్తించిన స్థానిక యువకులు, నిఘా పెట్టి అవకాశం కోసం కాచుకుని ఉన్నారు.

చివరకు వారికే తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టి రాసలీలల్ని చిత్రీకరించారట. ఈ వీడియో ఇప్పుడు సిరిసిల్లలో హాట్ టాపిక్ గా మారిందట. ఈ విషయం ఆనోటా ఈనోటా ప్రాచరమై సదరు రాజకీయనాయకుడిని చేరింది. దీంతో సదరు ప్రజా ప్రతినిధి ఆ వీడియో బయటపడకుండా ఉండేందుకు విశ్వప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. పోలీసులు కూడా దర్యాప్తు ఇంకా అందలేదని, అందితే మాత్రం విచారణ చేపడతామని చెబుతున్నారు.

ఈ వెగటు వ్యవహారం రూమరో కాదో అన్నది తేలన్నప్పటికీ వెలుగులోకి వచ్చి నాలుగు రోజులు అవుతున్నా మంత్రి తరపున ఎలాంటి రియాక్షన్ లేకపోవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అసలు ఆయన అధికార పక్షానికి చెందిన వ్యక్తే కాదన్న మరో ప్రచారం జరుగుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Scandal Video  Rajanna Sircilla  KTR  

Other Articles